×
Ad

Dear Astronaut : 11 ఏళ్ళ తర్వాత హీరో హీరోయిన్స్ గా నటించబోతున్న భార్యాభర్తలు.. లిప్ కిస్ తో పోస్టర్ రిలీజ్..

ఈ జంట 11 ఏళ్ళ తర్వాత హీరో హీరోయిన్స్ గా కలిసి నటించబోతున్నారు. (Dear Astronaut)

Dear Astronaut

  • హీరో హీరోయిన్స్ గా భార్యాభర్తలు
  • కొత్త సినిమా ప్రకటన
  • లిప్ కిస్ తో పోస్టర్ రిలీజ్

Dear Astronaut : సినీ పరిశ్రమలో ఉన్న హీరో హీరోయిన్స్ చాలామంది భార్యాభర్తలు కూడా అయ్యారు. సినిమాల్లో కలిసి నటించారు. తాజాగా మరో జంట కలిసి నటిస్తుంది. హీరో వరుణ్ సందేశ్ – హీరోయిన్ వితిక షేరు జంటగా 2015 లో పడ్డానండి ప్రేమలో మరి సినిమా చేసారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలు పడి కొన్నాళ్ళకు పెళ్లి చేసుకున్నారు.(Dear Astronaut)

పెళ్లి తర్వాత వితిక షేరు కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియా, యూట్యూబ్, టెలివిజన్ షోలతో బిజీగానే ఉంది. ఇక హ్యాపీ డేస్ తో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్ హీరోగా మొదట్లో మంచి సక్సెస్ లు కొట్టాడు. తర్వాత వరుస ఫ్లాప్స్ రావడంతో కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇటీవల వరుసగా సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగానే ఉన్నాడు.

Also Read : Rajasaab Collections :’రాజాసాబ్’ కలెక్షన్స్ కి బిగ్ ఎఫెక్ట్.. ప్రభాస్ ఏ రికార్డ్ బ్రేక్ చేస్తాడో..

ఇప్పుడు ఈ జంట 11 ఏళ్ళ తర్వాత హీరో హీరోయిన్స్ గా కలిసి నటించబోతున్నారు. వరుణ్ సందేశ్ – వితిక షేరు జంటగా ‘డియర్ ఆస్ట్రోనాట్’ అనే సినిమాను నేడు ప్రకటించారు. కార్తీక్ భాగ్యరాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సినిమాని ప్రకటిస్తూ రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్ లో వితిక ఆస్ట్రోనాట్ డ్రెస్ లో ఉండగా వరుణ్ తనకు లిప్ కిస్ పెడుతున్నాడు. వెనక రాకెట్ ఉంది.

దీంతో ఈ సినిమా ఆస్ట్రోనాట్, రాకెట్స్, అంతరిక్షం వంటి అంశాలతో ఓ ప్రేమకథగా ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఈ భార్యాభర్తల జంట హీరోహీరోయిన్స్ గా ఎలా మెప్పిస్తారో చూడాలి.

Also Read : The Raja Saab Review : ‘ది రాజాసాబ్’ మూవీ రివ్యూ.. హారర్ సినిమా అన్నారు.. కానీ..