Will Tarun act in Mahesh Trivikram's film?
SSMB 28 : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కబోతున్న మూడో చిత్రం SSMB 28. దీని రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే వీళ్ళ ఇద్దరి కలయికలో వచ్చిన అతడు, ఖలేజా మంచి ప్రజాధారణ పొందడంతో, ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.
అయితే ఇప్పుడు ఈ చిత్రం గురించి ఒక ఇంట్రస్టింగ్ టాపిక్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఒకప్పటి టాలీవుడ్ లవర్ బాయ్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆ లవర్ బాయ్ ఎవరంటే.. నువ్వే కావాలి, నువ్వే నువ్వే లాంటి చిత్రాల్లో నటించి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో తరుణ్. దర్శకుడు త్రివిక్రమ్ గతంలోనే తరుణ్ తో కలిసి పనిచేసి హిట్ సినిమాలను ఇచ్చాడు. అయితే ఇప్పుడు SSMB 28లో ఒక ముఖ్య పాత్ర కోసం చిత్ర బృందం హీరో తరుణ్ ని కలిసినట్టు టాలీవుడ్ లో జోరుగా వినిపిస్తుంది. కానీ దీని మీద ఎటువంటి అధికార ప్రకటన చిత్ర బృందం చేయలేదు.
Viashnav Tej : అన్నయ్య, బావని పెట్టి మల్టీస్టారర్.. త్వరలో డైరెక్షన్ చేస్తా అంటున్న మెగా హీరో..
ఏదేమైనా హీరో తరుణ్ కెరీర్ మొదట్లో ఎన్నో హిట్స్ ఇచ్చినా, ఇప్పుడు మాత్రం కెరీర్ చాలా డల్ గా ఉంది అనే చెప్పాలి. ఈ సమయంలో తనకి హిట్ సినిమా ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాలో ఛాన్స్ ఇస్తే అది తరుణ్ కెరీర్ కి చాలా ప్లస్ అవుతుంది అనే చెప్పొచ్చు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే.