రియల్ హీరో: అభినందన్ బయోపిక్..?

  • Publish Date - March 4, 2019 / 04:22 PM IST

భారత సినీ చరిత్రలో బయోపిక్ లు కామన్ అయిపోయాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మారుమ్రోగిన భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ బయోపిక్ ను కూడా తీసేందుకు సినిమావాళ్లు సిద్దం అయిపోయారు. పాకిస్తాన్ చరలో ఉండి అభినందన్‌ ఆ దేశ అధికారులకు భయపడకుండా దీటుగా సమాధానాలు ఇవ్వడంతో ప్రతీ ఒక్కరు ఆయనను అభినందించారు. దాదాపు 60 గంటల పాటు పాకిస్తాన్ చరలో బందించబడి చివరకు భారత్ చేరుకున్న అభినందన్ జీవిత చరిత్రను తెరకెక్కించాలని బాలీవుడ్‌ ప్రముఖ దర్శక నిర్మాతలు కొందరు ఉవ్విళ్లూరుతున్నారు.
Also Read : కన్నడలో డబ్ అయిన రంగస్థలం

బాలీవుడ్‌ హీరోలు ఇందుకు మినహాయింపు కాదు.అభినందన్‌ భారత్‌ వచ్చిన రోజు నుంచి ఈ చిత్రాలకు సంబంధించిన టైటిళ్లను రిజిస్టర్‌ చేసే పనిలో పడ్డారు.  ఇందులో భాగంగా అభిషేక్‌ కపూర్‌ దర్శకత్వంలో టీ-సిరీస్‌, సంజయ్ లీలా భన్సాలీ సంయుక్తంగా పుల్వామా దాడి నేపథ్యంలో వచ్చే సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ క్రమంలోనే  అభినందన్ పాత్రలో నటించాలని ఉందని జాన్‌ అబ్రహం వెల్లడించడంతో దేశానికి నిజజీవిత హీరో అయిన అభినందన్ పాత్రలో ఆయన నటించే అవకాశం కనిపిస్తుందని బాలివుడ్ వర్గాలు చెబుతున్నాయి. 
Also Read : షాక్ ఇచ్చిన మహేష్ బాబు.. సినిమా ఆగిపోయిందట!