Women Choreographer Reveal Sensational Insidents on Jani Master in FIR
Jani Master : నేడు జానీ మాస్టర్ పై ఓ మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. జానీ మాస్టర్ వద్ద కొన్నాళ్లుగా పనిచేస్తున్న ఓ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని, అవుట్ డోర్ షూటింగ్స్ లో జానీ మాస్టర్ తనపై పలు మార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం జానీ మాస్టర్ పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
అయితే జానీ మాస్టర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు వెల్లడించింది మహిళా కొరియోగ్రాఫర్. ఎఫ్ఐఆర్ లో.. 2017లో డీషోలో జానీ మాస్టర్ తో పరిచయం అయిందని, ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుండి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉండాలంటూ ఫోన్ రావడంతో 2019లో జానీ మాస్టర్ టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయ్యానని, ఓ షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్లగా అక్కడ హోటల్లో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు అని తెలిపింది.
Also Read : Jani Master : జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. కేసు నమోదు చేసిన పోలీసులు..
ఆ ఘటన తర్వాత విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పొద్దూ అంటూ బెదిరించారని, పలుమార్లు షూటింగ్ సమయంలో జానీ మాస్టర్ చెప్పినట్లు వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడు అని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం కూడా చేసాడని జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసింది.