Jani Master : జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. కేసు నమోదు చేసిన పోలీసులు..

తాజాగా జానీ మాస్టర్ పై ఓ మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది.

Jani Master : జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. కేసు నమోదు చేసిన పోలీసులు..

Harassment Allegations on Jani Master by Female Dancer

Updated On : September 16, 2024 / 9:37 AM IST

Jani Master : జానీ మాస్టర్ ఇటీవల తన వర్క్ లో బాగా పాపులర్ అవుతున్నారు. డ్యాన్స్ మాస్టర్ గా అన్ని భాషల్లోని పాన్ ఇండియా సినిమాలకు పని చేస్తున్నారు. ఇటీవలే నేషనల్ అవార్డు కూడా సాధించారు. ఇక జనసేన పార్టీలో కూడా ఎదుగుతున్నారు. కొన్ని రోజుల క్రితం వరదల సమయంలో కూడా జానీ మాస్టర్ వరద బాధితులని పరామర్శించి వారికి నిత్యావసర సరుకులు అందచేశారు.

అయితే తాజాగా జానీ మాస్టర్ పై ఓ మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. జానీ మాస్టర్ వద్ద కొన్నాళ్లుగా పనిచేస్తున్న ఓ మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని, చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా పలు నగరాల్లో, అవుట్‌ డోర్ షూటింగ్స్ లో, నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై పలు మార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read : Shekar Basha : నేనే కావాలని అడిగి బయటకు వచ్చేసాను.. శేఖర్ బాషా సంచలన వ్యాఖ్యలు..

ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి, విచారణ కోసం ఆమె నార్సింగి నివాసి కావడంతో నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేసారు. నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ పై ఐపిసి సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం (323)లోని క్లాజ్ (2) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే దీనిపై ఇంకా జానీ మాస్టర్ స్పందించలేదు.