Cannes 2023 : కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఉక్రెయిన్‌ నిరసన.. ఒంటిపై రక్తంతో మహిళ..

ఫ్రాన్స్ లో జరుగుతున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఒక మహిళ ఉక్రెయిన్‌ విషయమై నిరసన తెలియజేసింది. రెడ్ కార్పెట్ పై ఒంటి పై రక్తంతో..

76th Cannes Film Festival : ఫ్రాన్స్(France) లో జరిగే కాన్స్ ఫిలిం ఫెస్టివల్ (Cannes Film Festival) ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా ప్రారంభమైంది. ఈ ఇయర్ జరగబోతున్న 76వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ కి కూడా ప్రపంచంలోని అనేకమంది నటీనటులు, టెక్నీషియన్స్ హాజరయ్యి సందడి చేస్తున్నారు. మే 16 నుంచి 27 వరకు జరగనున్న ఈ ఫెస్టివల్ కి మన ఇండియా (India) తరుపు నుంచి పలువురు సినీ తారలు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో తాజాగా ఒక అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంది.

Bro : స్పెషల్ సాంగ్‌లో Bro తో చిందేయడానికి పోటీ పడుతున్న భామలు.. నిజమేనా?

గత ఏడాది కాలంగా ఉక్రెయిన్‌పై (Ukraine) రష్యా (Russia) జరుపుతున్న దాడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ జరుగుతున్న రక్తపాతం ప్రపంచం మొత్తం చూస్తూ అయ్యో అనుకోవడం తప్ప ఏమి చేయలేకపోతున్నారు. కానీ ఒక మహిళ ఉక్రెయిన్‌పై రష్యా దాడులను వ్యతిరేకిస్తూ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో నిరసన తెలియజేసింది.

అసలు విషయం ఏంటంటే.. కాన్స్ ఫెస్టివల్ కి ఒక మహిళ ఉక్రెయిన్‌ జెండా రంగులున్న డ్రెస్ ని ధరించి హాజరయ్యింది. రెడ్ కార్పెట్ పై నడుచుకుంటూ వచ్చిన ఆమె ఒక చోట ఆగి ఫోటోలకు ఫోజులు ఇస్తూ.. తనతో తెచ్చుకున్న రెండు నకిలీ బ్లడ్ బాటిల్స్ ఓపెన్ చేసి ఒంటి పై ఆ రక్తాన్ని పోసుకొని నిరసన వ్యక్తం చేసింది. ఇక ఇది గమనించిన అక్కడ సిబ్బంది వెంటనే ఆమెను అక్కడి నుంచి బయటకి తరలించేశారు. ఆ మహిళ ఉక్రెయిన్‌ దేశస్థురాలి అయ్యిఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Bro : మార్క్ ని పరిచయం చేసిన బ్రో.. మామా అల్లుళ్ళ లుక్స్ అదుర్స్‌!

అయితే గత ఏడాది కూడా ఇటువంటి సంఘటనే కాన్స్ లో చోటు చేసుకొని అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అలాంటి సంఘటన జరగడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ కాన్స్ నిర్వాహకులు రష్యా ప్రతినిధులు, ఫిల్మ్‌ కంపెనీల పై నిషేధం కూడా విధించారు.

ట్రెండింగ్ వార్తలు