Bro : మార్క్ ని పరిచయం చేసిన బ్రో.. మామా అల్లుళ్ళ లుక్స్ అదుర్స్‌!

పవన్, సాయి ధరమ్ నటిస్తున్న Bro సినిమా నుంచి పవన్ లుక్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. నేడు సాయి ధరమ్ లుక్ ని రిలీజ్ చేశారు.

Bro : మార్క్ ని పరిచయం చేసిన బ్రో.. మామా అల్లుళ్ళ లుక్స్ అదుర్స్‌!

Sai Dharam tej look out from Pawan Kalyan Bro movie

Updated On : May 23, 2023 / 4:36 PM IST

Pawan Kalyan Bro : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam tej) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘Bro’ మూవీ కోసం మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఫాంటసీ కామెడీ డ్రామాగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘వినోదయ సిత్తం’కి ఇది రీమేక్ గా వస్తుంది. సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఇప్పడు తెలుగులో కూడా ఈ చిత్రాన్ని కూడా ఆయనే తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇటీవలే ఈ మూవీ నుంచి పవన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా ఆడియన్స్ ని సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీలోని సాయి ధరమ్ లుక్ ని రివీల్ చేశారు మేకర్స్.

Ram Charan : 2016లో ఇదే ఆడిటోరియంలో సినిమా షూట్ చేశాం.. ఇప్పుడు సమ్మిట్‌లో పాల్గొన్నా.. రామ్‍చరణ్!

సాయి ధరమ్ ‘మార్కండేయులు’ అలియాస్ ‘మార్క్’ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. వైట్ అండ్ వైట్ లో సాయి ధరమ్ హ్యాండ్‌సమ్ లుక్ లో అదరగొడుతున్నాడు. మొన్నటి పవన్ లుక్ లాగానే ఈ లుక్ కూడా అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. కాగా ఈ మూవీకి సంబంధించిన పవన్ షూటింగ్ ని ఆల్రెడీ పూర్తి చేసిన మేకర్స్.. ఇప్పుడు సాయి ధరమ్ సీన్స్ అండ్ బ్యాలన్స్ షూట్ ని కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. దీంతో మూవీ ఆడియో పై అభిమానులు మంచి అంచనాలే క్రియేట్ అయ్యాయి.

Ram Charan : హాలీవుడ్ నిర్మాత, డైరెక్టర్‌ని.. ఇండియా రావాలని కండిషన్ పెడతా.. రామ్‌చరణ్!

ఇక ఈ సినిమాలో కేతిక శర్మ (Ketika Sharma) సాయి ధరమ్ కి హీరోయిన్ గా నటించబోతుందని తెలుస్తుంది. ఇక మరో అందాల భామ ప్రియా వారియర్ చెల్లి పాత్రలో కనిపించబోతుందని సమాచారం. కాగా తమిళంలో ఈ సినిమా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది. మరి ఇప్పుడు ఈ రీమేక్ ని ఏ నేపథ్యంతో తెరకెక్కిస్తున్నారో అని అందరిలో ఆసక్తి నెలకుంది. జులై 28న ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రాబోతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.