Game of Thrones : వరల్డ్ సూపర్ హిట్ టెలివిజన్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఇప్పుడు తెలుగులో.. ఏ ఓటీటీలో?

భారత్ లో కూడా 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'కి అభిమానులు ఉన్నారు. ఇక్కడ కూడా ఈ సిరీస్ పెద్ద విజయం సాధించింది. అయితే ఇన్నాళ్లు ఇది ఇంగ్లీష్ భాషలోనే స్ట్రీమ్ అయింది.

World Famous Series Game of Thrones now available in Telugu Language also OTT Details

Game of Thrones : 2011లో మొదలైన హాలీవుడ్(Hollywood) టెలివిజన్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ 8 సీజన్లుగా 2019 వరకు సాగింది. HBO ఛానల్ లో ఈ షో టెలికాస్ట్ అయింది. అనంతరం అమెజాన్ ఓటీటీకి వచ్చాక ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ కి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. భారత్ లో కూడా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’కి అభిమానులు ఉన్నారు. ఇక్కడ కూడా ఈ సిరీస్ పెద్ద విజయం సాధించింది. అయితే ఇన్నాళ్లు ఇది ఇంగ్లీష్ భాషలోనే స్ట్రీమ్ అయింది.

తాజాగా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ లోకల్ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. జియో సినిమా(Jio Cinema) ఓటీటీలో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ని లోకల్ భాషల్లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. మొదట హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ని జియోలో అందించగా.. తాజాగా తెలుగులో కూడా ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్ ని స్ట్రీమింగ్ చేస్తుంది జియో సినిమా. దీంతో తెలుగు ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ అభిమానులు మరోసారి చూడటానికి రెడీ అయిపోయారు.

Also Read : Maniratnam : కమల్ హాసన్ కోసం మణిరత్నం కాపీ కొట్టారా? KH234 ఆ సినిమాకు కాపీ అంటూ ట్రోల్స్..

జియో సినిమాస్ లో చాలా సినిమాలు ఫ్రీగానే స్ట్రీమింగ్ చేస్తున్నప్పటికీ కొన్ని మాత్రం సెలెక్టివ్ గా సబ్‌స్క్రిప్షన్ చేసుకుంటేనే అందిస్తున్నారు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సిరీస్ కూడా లోకల్ భాషల్లో చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు