Writers Room
Writers Room : చాలా మంది రాయగలిగే సత్తా ఉన్నా టీవీ, సినీ పరిశ్రమలలోకి తెలిసిన వాళ్ళు ఎవరూ లేకుండా రావడం కష్టం. అలంటి వాళ్ళ కోసం, కాబోయే రచయితల కోసం జీ తెలుగు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుంది. జీ తెలుగు ఔత్సాహిక రచయితలకు గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. జీ రైటర్స్ రూమ్ అని కొత్తగా ప్రారంభించి రచయితలను తీసుకుంటుంది.(Writers Room)
‘యువర్స్ ట్రూలీ Z’ అనే కంపెనీ బ్రాండ్‌తో జీ కంపెనీ అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కథలకు, ప్రోగ్రామ్స్ కి రచయితలను తీసుకుంటుంది. ఇందుకోసం రాత పరీక్షా నిర్వహిస్తుంది జీ సంస్థ. జీ సంస్థలోని టీవీ, డిజిటల్, సినిమా ప్లాట్‌ఫామ్‌ల కోసం సమర్థవంతమైన, ఆకర్షణీయమైన కథలను రూపొందించే అవకాశం కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే జరుగుతున్న జీ రైటర్స్ రూమ్ కార్యక్రమం ఇప్పుడు హైదరాబాద్ లో జరగనుంది.
జీ తెలుగు ఆగస్టు 30న హైదరాబాద్ లో అమీర్ పేట్ సారథి స్టూడియోస్ ఎదురుగా ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ లో రైటర్స్ రూమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇందులో పాల్గొనాలనుకునే వాళ్ళు ఆ అడ్రెస్ కు ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు వెళ్లొచ్చు. మరిన్ని వివరాలకు 9397397771 నెంబర్ కు కాల్ చేయొచ్చు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులు జీ రైటర్స్ రూమ్‌లో చేరే అవకాశం లభిస్తుంది. వారికి పరిశ్రమ నిపుణులు రచనాశైలిలో మెలకువలు నేర్పిస్తారు. అనంతరం జీ నుంచి రాబోయే ప్రాజెక్టులలో ఈ రచయితలు భాగమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జీ రైటర్స్ రూమ్ ఆధ్వర్యంలో నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో జరిగిన సెలక్షన్స్‌లో వందలాదిమంది ఔత్సాహిక రచయితలు పాల్గొన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఛాన్స్ ని మీరు కూడా వినియోగించుకోండి.
Also Read : Vishal engagement : హీరోయిన్ సాయి ధన్సికతో హీరో విశాల్ ఎంగేజ్‌మెంట్
ఈ కార్యక్రమం గురించి జీ ఎంటర్‌టైన్‌మెంట్ సౌత్ హెడ్ అనురాధ గూడురు మాట్లాడుతూ.. జీ రైటర్స్ రూమ్ ఔత్సాహిక రచయితలని వెలికితీసే ఒక అవకాశం. ఈ కార్యక్రమం ద్వారా ఎంపికైన రచయితలు మా సంస్థలో రూపొందే సీరియల్స్, సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు పనిచేసే అవకాశం ఉంటుందని తెలిపారు.