Toxic Shooting : కేజీఎఫ్ మూవీలతో పాన్ ఇండియా స్టార్ డమ్ సంపాదించుకున్నాడు యశ్. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్ దాస్ డైరెక్షన్‌లో ‘టాక్సిక్’ మూవీలో నటించనున్నాడు. ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారికి శుభవార్త అందింది. ఆగస్టు 8న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
8-8-2024 రోజున బెంగళూరులో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో కె.వి.ఎన్. ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై కె.నారాయణ, యశ్‌లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ క్రమంలో చిత్ర బృందం ధర్మస్థల టౌన్‌లోని బెల్తంగడి సూర్య సదాశివ రుద్ర ఆలయాన్ని సందర్శించింది. ఆలయ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి యశ్ కుటుంబసభ్యులకు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ అన్నదాన సత్రంలో భక్తులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.
Prabhas : ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!
ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ ట్యాగ్‌లైన్‌తో యశ్ 19వ సినిమాగా ఈ మూవీ రాబోతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో 1970లలో గోవా, కర్ణాటక బ్యాక్ డ్రాప్‌లో మూవీ ఉండనున్నట్లు టాక్.
And #TOXIC begins…
? Rocking Star Yash’s #Toxic: A Fairy Tale for Grown-Ups starts filming in Bangalore on 8/8/2024 (8-8-8)!
Producers Venkat K. Narayana and @TheNameIsYash visited temples to seek blessings ahead of their epic journey to unfold ❤️?
The film is directed by… pic.twitter.com/edVAkyGW9M— Vamsi Kaka (@vamsikaka) August 6, 2024