Prabhas : ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!

టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న రికార్డు యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌దే.

Prabhas : ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!

Do you know Rebel Star Prabhas Remuneration

Prabhas Remuneration : టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న రికార్డు యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌దే. వరుసగా పాన్‌ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్‌ రేంజ్‌ సినిమా సినిమాకు పెరుగుతోంది. కల్కి సినిమా విజయంతో తన మార్కెట్‌ను కూడా భారీగా పెంచాలని డిసైడయ్యాడట ప్రభాస్‌.

వరల్డ్‌ వైడ్‌ హిట్‌కొట్టిన కల్కి దాదాపు 12 వందల కోట్లు వసూలు వసూలు చేసింది. దీంతో తన రెమ్యూనరేషన్‌ను ప్రభాస్‌ పెంచేశాడని టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం 150 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న ప్రభాస్‌.. వచ్చే సినిమాల నుంచి 200 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.

Rajamouli : రాజమౌళి స్టాంప్ ఏ సినిమా నుంచి మొదలయింది..? స్టాంప్ తీసేద్దామనుకున్నాడు.. కానీ..

రెమ్యూనరేషన్‌ పెంచినా.. ప్రభాస్‌తో సినిమాలకు నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయని చెబుతున్నారు. బాహుబలి, కల్కి వంటి హిట్‌లతో నిర్మాణ సంస్థలకు కాసులు పండించిన ప్రభాస్‌తో కొత్త ప్రాజెక్టులు చేసేందుకు చాలా కార్పొరేట్ సంస్థలు ముందు కొస్తున్నాయంటున్నారు. ఆర్థికంగా భారమనుకున్న వారు కూడా రెండు మూడు సంస్థలను పార్టనర్స్‌గా చేర్చుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాలకు కమిట్‌ అయ్యారు.

సలార్, kalki సినిమాలు సెకండ్‌ పార్ట్‌లతోపాటు హనురాఘవ పూడితో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలకు తన రెమ్యూనరేషన్‌గా 200 కోట్లు చెల్లించాలని ప్రభాస్‌ అడుగుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఐతే ప్రభాస్ ఇలా తన రెమ్యూనరేషన్‌ను పెంచుకుంటూ పోతే ఆయనతో సినిమాలు చేయాలనుకుంటున్న నిర్మాతలకు కష్టమేనని అంటున్నాయి సినీ వర్గాలు. మరోవైపు మిగతా స్టార్స్ కూడా ప్రభాస్ రెమ్యూనరేషన్ గురించి తెలిసి తాము కూడా పెంచాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. తమ రెమ్యూనరేషన్‌ పెంచకపోతే… మార్కెట్లో తమకు డిమాండ్ లేదనుకునే ప్రమాదం వుందనే కారణంతో కొందరు యంగ్‌ హీరోలు తమ రెమ్యూనరేషన్‌ పెంచే విషయం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.

Roja : ఫ్యామిలీతో రోజా వెకేషన్‌కి వెళ్లారా? వైరల్ అవుతున్న ఫొటో..