Roja : ఫ్యామిలీతో రోజా వెకేషన్‌కి వెళ్లారా? వైరల్ అవుతున్న ఫొటో..

తాజాగా రోజా ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లిందని సమాచారం.

Roja : ఫ్యామిలీతో రోజా వెకేషన్‌కి వెళ్లారా? వైరల్ అవుతున్న ఫొటో..

Actress Ex Minister Roja Went to Italy Vacation with Family Photo goes Viral

Updated On : August 6, 2024 / 4:23 PM IST

RK Roja : నటి, మాజీ మంత్రి రోజా ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. గతంలో వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రోజా ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్ళీ మీడియా ముందుకు రాలేదు. ముందు నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న రోజా ఓటమి అనంతరం కూడా అప్పుడప్పుడు పలు ఫొటోలు షేర్ చేశారు.

ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజా మళ్ళీ జబర్దస్త్ కి వస్తున్నారని, టీవీ షోలు, సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వచ్చినా అవన్నీ రూమర్స్ గానే మిగిలిపోయాయి. అయితే తాజాగా రోజా ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కి వెళ్లినట్టు తెలుస్తోంది.

Also Read : రాజమౌళి స్టాంప్ ఏ సినిమా నుంచి మొదలయింది..? స్టాంప్ తీసేద్దామనుకున్నాడు.. కానీ..

రోజా ఫ్యామిలీతో కలిసి ఇటలీ దేశానికి వెకేషన్‌కి వెళ్లినట్టుగా ఓ ఫొటో వైరల్ అవుతుంది. రోజా విదేశాల్లో తిరుగుతుండగా దూరం నుంచి తీసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే రోజా ఈ విదేశీ పర్యటనపై ఎలాంటి పోస్ట్ చేయలేదు. రోజా ఫొటో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.

Actress Ex Minister Roja Went to Italy Vacation with Family Photo goes Viral