Bigg Boss Yashmi : ఇంకో జన్మ ఉంటే నిన్నే పెళ్లి చేసుకుంటాను.. బిగ్‌బాస్‌లో తన లవ్ స్టోరీ చెప్పి ఎమోషనల్ అయిన యష్మి..

నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ని తమ మొదటి లవ్ స్టోరీలు చెప్పాలని బిగ్ బాస్ కోరాడు. ఈ క్రమంలో నటి యష్మి గౌడ తన ప్రేమ కథ గురించి చెప్తూ..

Yashmi Gowda Reveals her Love Story in Biggboss and get Emotional

Bigg Boss Yashmi : బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్ సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తుంది. నేటితో 11 వారాలు పూర్తి చేసుకుంటుంది. ఇక నేడు ఆదివారం ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. అయితే నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ని తమ మొదటి లవ్ స్టోరీలు చెప్పాలని బిగ్ బాస్ కోరాడు. ఈ క్రమంలో పలువురు కంటెస్టెంట్స్ తమ ప్రేమ కథలను పంచుకున్నారు.

Also Read : Pushpa 2 : నేడే అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్.. ఎప్పుడు? ఎక్కడ? ఏ ఛానల్ లో?

ఈ క్రమంలో నటి యష్మి గౌడ తన ప్రేమ కథ గురించి చెప్తూ.. నేను కాలేజీలో ఉన్నప్పుడు చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకునేదాన్ని. నా లైఫ్ చాలా మెస్ అయిపోయింది. అలాంటి ఒక సమయంలో నేను ఒక పర్సన్ ని మీట్ అయ్యాను. మొదట ఫ్రెండ్ అయ్యాడు. ఆ తర్వాత రిలేషన్ షిప్ లోకి వెళ్లి ప్రేమించుకున్నాము. కానీ ఒకానొక సమయంలో నాకు ఫ్యామిలీనే ముఖ్యమనిపించింది. అప్పుడు మా మధ్య విబేధాలు కూడా వచ్చాయి. ప్రేమ మీద నమ్మకం పోయింది. మా నాన్న తప్ప ఇంకెవరూ వద్దనుకున్నాను. కానీ ఇప్పటికి కూడా అతను నా కోసం ఎదురుచూస్తున్నాడు. నేనే అతన్ని ఒప్పుకోలేకపోయాతున్నాను. కానీ ఇప్పటికి అతను నన్ను గైడ్ చేస్తూ ఫ్రెండ్ గా ఉన్నాడు. ఇప్పుడు కుదరకపోవచ్చు ఏమో కానీ ఇంకో జన్మ అంటూ ఉంటే అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తూ ఎమోషనల్ అయింది యష్మి. ఇంతకీ యష్మి కోసం ఎదురుచూస్తున్న ఆ అబ్బాయి ఎవరో మాత్రం చెప్పలేదు.