Yashoda Teaser: యశోద టీజర్.. మామూలుగా ఉండదట!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న యశోద చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. కాగా, సెప్టెంబర్ 9న సాయంత్రం 5.49 గంటలకు ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఈ టీజర్ సామ్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Yashoda Teaser Will Shock You Says Movie Team

Yashoda Teaser: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఈ బ్యూటీ నటిస్తున్న వరుస సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అందులో సామ్ నటిస్తున్న యశోద చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. కాగా, ఈ సినిమాకు సంబంధించి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మాత్రమే ఇప్పటివరకు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Samantha Yashoda : సాలిడ్ అప్డేట్‌తో వచ్చిన యశోద.. పండగ చేసుకుంటున్న సామ్ ఫ్యాన్స్

దీంతో ఈ సినిమా టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా చూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఈ చిత్ర టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్‌ను అనౌన్స్ చేసి ఈ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశారు. పూర్తిగా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను హరి-హరీశ్‌లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సమంత పాత్ర చాలా ఆసక్తికరంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. సెప్టెంబర్ 9న సాయంత్రం 5.49 గంటలకు ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది.

Yashoda: సమంత ‘యశోద’కు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్!

అయితే ఈ టీజర్ సామ్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. థ్రిల్లింగ్ అంశాలను ఈ టీజర్‌లో చూపెట్టే విధానం ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ అంటోంది. ఈ టీజర్ అభిమానులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని చిత్ర యూనిట్ అంటోంది. మరి నిజంగానే యశోద చిత్ర టీజర్ మరో లెవెల్‌లో ఉంటుందా లేదా అనేది తెలియాలంటే సెప్టెంబర్ 9 వరకు ఆగాల్సిందే.