Silpa Ravi Chandra Reddy : అల్లు అర్జున్ పుష్ప 2 కోసం స్పెషల్ పోస్ట్ చేసిన బన్నీ ఫ్రెండ్, వైసీపీ నేత..

తాజాగా వైసీపీ నేత శిల్పా రవి రెడ్డి అల్లు అర్జున్ పుష్ప 2 కి విషెష్ చెప్తూ పోస్ట్ చేసాడు.

YCP Leader Silpa Ravi Chandra Kishore Reddy Wishes to Allu Arjun Pushpa 2 Tweet goes Viral

Silpa Ravi Chandra Reddy : అల్లు అర్జున్ త్వరలో డిసెంబర్ 5న పుష్ప 2 సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు, ప్రేక్షకులు దేశమంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ప్రముఖులు అంతా అంతా పుష్ప 2 కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఫ్రెండ్, మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కూడా అల్లు అర్జున్ కి బెస్ట్ విషెష్ చెప్తూ పోస్ట్ చేసాడు.

గతంలో ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాల లో వైసీపీ నేత శిల్పా రవి రెడ్డి తన ఫ్రెండ్ అంటూ అల్లు అర్జున్ వెళ్లి ప్రచారం చేయడంతో భారీ వివాదమే చెలరేగింది. జనసైనికులు, మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశాడని విమర్శలు చేసారు. అప్పట్నుంచి మెగా ఫ్యాన్స్ – బన్నీ ఫ్యాన్స్ వివాదం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో శిల్పా రవి రెడ్డి ఓడిపోయాడు. కానీ ఆ వివాదం మాత్రం ఇప్పటికి ఫ్యాన్స్ లో కొనసాగుతూనే ఉంది.

Also Read : Pushpa 2 : మొన్న నార్త్ అయింది.. ఇప్పుడు సౌత్.. పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ చెన్నైలో.. ఎప్పుడంటే..?

తాజాగా వైసీపీ నేత శిల్పా రవి రెడ్డి అల్లు అర్జున్ పుష్ప 2 కి విషెష్ చెప్తూ పోస్ట్ చేసాడు. ఇటీవల పలు బిజినెస్ బ్రాండ్స్ పుష్ప 2ని ప్రచారం చేస్తూ తమ ఉత్పత్తులపై పుష్ప ఫోటోలు వేస్తున్న సంగతి తెలిసిందే. అగరబత్తులు, అగ్గిపెట్టెలు, బిస్కెట్స్, స్నాక్స్.. ఇలా అనేక వాటిపై పుష్ప బొమ్మలు ప్రింట్ చేస్తున్నారు. ఇలాంటివి ఫోటో తీసి శిల్పా రవిరెడ్డి తన ట్విట్టర్ లో షేర్ చేసి.. ఆల్ ది బెస్ట్. స్క్రీన్ పై వైల్డ్ ఫైర్ చూడటానికి ఎదురుచూస్తున్నాను అంటూ పోస్ట్ చేసాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. దీంతో మరోసారి మెగా ఫ్యాన్స్ శిల్పా రవి రెడ్డి పోస్ట్ పై కామెంట్స్ చేస్తున్నారు.