Ali – Roja – Posani : వైసీపీ ఓటమితో.. ఆ నటీనటుల భవిష్యత్తు ఏంటి?

తాజా ఎన్నికల తర్వాత వైసీపీలో పనిచేసిన కొంతమంది నటీనటులు మళ్లీ చిత్ర పరిశ్రమలో కనిపిస్తారా? అవకాశాలు వస్తాయా అని చర్చగా మారింది.

YCP Persons Ali Posani Roja Film Career in Doubt with Election Results

Ali – Roja – Posani : పాలిటిక్స్‌ తర్వాత ఎక్కువ ఫోకస్‌ ఉండేది ఒక్క సినిమా రంగంలోనే. రాజకీయాలు, సినిమాలు నాణేనికి బొమ్మా బొరుసుల్లాంటివి. పవర్‌, ఫైనాన్స్‌, గ్లామర్‌ ఈ మూడూ ఈ రెండు రంగాల్లోనే ఎక్కువ. అందుకే ఎక్కువ మంది సినీ నటులు రాజకీయాలపై ఆసక్తి పెంచుకుంటారు. అవకాశాలు తగ్గిన తర్వాత కొందరు, కెరీర్‌ పీక్‌ స్టేజ్‌లో ఉన్నా రాజకీయాల్లోనూ పవర్‌ చూపాలని మరికొందరు పాలిటిక్స్‌లో అదృష్టం పరీక్షించుకుంటారు. ఇలా పాలిటిక్స్‌లో వెళ్లిన వారు గతంలో కొంతమంది సక్సెస్ అయితే కొంతమంది ఫెయిల్ అయ్యారు.

అయితే తాజా ఎన్నికల తర్వాత వైసీపీలో పనిచేసిన కొంతమంది నటీనటులు మళ్లీ చిత్ర పరిశ్రమలో కనిపిస్తారా? అవకాశాలు వస్తాయా అని చర్చగా మారింది. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సినీ రంగం ప్రభావం చాలా ఎక్కువ. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఏపీ డిప్యూటీ సీఎం చక్రం తిప్పుతుండగా, అసెంబ్లీ ఎన్నికల వరకు వైసీపీ నేతలు రోజా, పోసాని కృష్ణమురళి, హస్యనటుడు అలీ ఓ వెలుగు వెలిగారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఇప్పుడు ఆ పార్టీలో పనిచేసిన నటీనటుల కెరీర్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మెగా కాంపౌండ్‌తో శత్రుత్వం పెట్టుకున్న నటులకు భవిష్యత్‌లో సినీ అవకాశాలు లభిస్తాయా? అన్నదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

వైసీపీ అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేసిన రోజా ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్‌తో రాజకీయంగా విభేదించడమే కాకుండా, వ్యక్తిగత విమర్శలతో వివాదాస్పదమయ్యారు. కొన్నాళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న రోజా ఓ టీవీ చానల్‌ కామిడీ షోకు జడ్జిగా వ్యవహరించారు. మంత్రి అవ్వడంతో ఆ షో వదిలేసి పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లారు. అయితే వైసీపీ ఓడిపోవడంతో ఆమె సినీ రంగంలో మళ్లీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు అవకాశాలు దక్కుతాయా? లేదా? అన్నదే ప్రధాన చర్చగా మారింది. రోజాకు అవకాశమిచ్చి ఏపీ ప్రభుత్వం దృష్టిలో పడటమెందుకు? అని ఎక్కువ మంది నిర్మాతలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.

Also Read : Vijay Deverakonda : ఏకంగా 18 మంది ట్రాన్స్‌ జెండర్స్‌‌కి విజయ్ దేవరకొండ సాయం.. ఏం చేసాడంటే..

ఇక వైసీపీలో పనిచేసిన మరో నటుడు పోసాని కృష్ణమురళి కెరీర్‌పైనా ఆసక్తికర చర్చ జరుగుతోంది. తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే పోసాని వైసీపీలో శ్రుతిమించిన విమర్శలతో వివాదాస్పదమయ్యారు. సీఎం చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్‌ను వ్యక్తిగతంగా విమర్శించి టీడీపీ, జనసేనలకు టార్గెట్‌ అయ్యారు. గతంలో పవర్‌స్టార్‌ పవన్‌తోపాటు మెగాస్టార్‌ చిరంజీవి సినిమాల్లో పోసాని కోసం ప్రత్యేకంగా పాత్రలు ఉండేవి. మెగా కాంపౌండ్‌లోనూ ఆయన ఎన్నో చిత్రాలు చేశారు. అయితే వైసీపీలో చేరిన తర్వాత విమర్శలతో విరుచుకుపడటం ఆయన కెరీర్‌ను డేంజర్‌ జోన్‌లోకి తీసుకువెళ్లిందని అంటున్నారు సినీ పండితులు. గతంలో మాదిరిగా మళ్లీ పోసాని స్క్రీన్‌పై కనిపించడం అంత ఈజీ కాదనే టాక్‌ వినిపిస్తోంది.

వైసీపీలో యాక్టివ్‌గా పనిచేసి ఓటమి తర్వాత రాజీనామా చేసిన కమెడియన్‌ అలీ పరిస్థితి ఎలా ఉంటుందనేది అర్థం కావడం లేదు. డిప్యూటీ సీఎం పవన్‌కు మంచి మిత్రుడిగా అలీని చెబుతుంటారు. రాజకీయంగా పవన్‌తో విభేదించినా, ఎన్నడూ విమర్శల జోలికి పోలేదు అలీ. కానీ ప్రత్యర్థి గుంపులో పనిచేయడం వల్ల అలీకి అవకాశాలిచ్చి పవన్‌ ఆగ్రహానికి గురవ్వడమెందుకని కొందరు నిర్మాతలు తటపటాయిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అలీ చేతిలో ఒక షో తప్ప చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి లేవు.

ఇక నటి, యాంకర్ శ్యామల పరిస్థితి కూడా ప్రశార్థకంగా ఉంది. కరెక్ట్ గా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ సహాయం చేయడం నేనెప్పుడూ చూడలేదు అంటూ పలు విమర్శలు చేసింది. దీంతో జనసైనికులు పవన్ గెలిచాక ఆమెని సోషల్ మీడియాలో బాగా టార్గెట్ చేసారు. అసలే ఆమెకు అవకాశాలు అంతంతమాత్రం ఈ దెబ్బకి ఉన్న అవకాశాలు కూడా కష్టమే అంటున్నారు. యాంకర్ గా అయితే ఎవరూ సినిమా ఈవెంట్లకు, ఇంటర్వ్యూలకు పిలిచే పరిస్థితి కనపడట్లేదు. మరి శ్యామల ఏం చేస్తుందో చూడాలి.

Also Read : Balakrishna : బాలయ్య 50 వసంతాల స్వర్ణోత్సవ సంబరాలు.. అటు అభిమానులు.. ఇటు సినీ పరిశ్రమ..

ఇదేసమయంలో టీడీపీ, జనసేనకు అనుబంధంగా పనిచేసిన నటులు మాత్రం చాలా రిలాక్స్‌గా ఫీల్‌ అవుతున్నారు. ఈ ఎన్నికల్లో 30 ఇయర్స్‌ ఫృద్వీరాజ్‌, హైపర్‌ ఆది వంటి హాస్యనటులు అధికార పార్టీ తరపున పనిచేశారు. ఇక పవన్‌తోపాటు బాలయ్య కుటుంబ సభ్యులు అంతా తమ పార్టీల తరఫున పనిచేశారు. దీంతో వైసీపీలో పనిచేసిన నటీనటులపై సినీ పరిశ్రమ ఫోకస్‌ పడింది. ముఖ్యంగా రోజా, పోసానికి మళ్లీ చాన్స్‌లు వస్తాయా అని సందేహిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ వైఖరిపైనే అలీ భవిష్యత్‌ ఆధారపడి ఉందని అంటున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు