×
Ad

Yellamma: ఇంకా లేట్ చేస్తే మొదటికే మోసం.. వేణుకు అర్థం అవుతుందా.. లేదా..?

కొన్నిసార్లు ఆనుకొకుండా వచ్చే విజయం కూడా మనల్సి డైలమాలో పడేస్తుంది(Yellamma). తరువాత ఎం చేయాలన్నా వెనుకా ముందు ఆలోచించాల్సి వస్తుంది. ఆలస్యం అవుతుంది. కానీ, ఇవన్నీ అవతల వ్యక్తులకు తెలియదు కదా.

Yellamma movie shooting not yet started, what is the reason

Yellamma: కొన్నిసార్లు ఆనుకొకుండా వచ్చే విజయం కూడా మనల్సి డైలమాలో పడేస్తుంది. తరువాత ఎం చేయాలన్నా వెనుకా ముందు ఆలోచించాల్సి వస్తుంది. ఆలస్యం అవుతుంది. కానీ, ఇవన్నీ అవతల వ్యక్తులకు తెలియదు కదా. ఆ ఆలోచనలు సెట్ అయ్యేలోపే జరగాల్సిన(Yellamma) నష్టం జరిగిపోతుంది. ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్నాడు బలగం వేణు. బలగం సినిమాతో ఎమోషనల్ హిట్ అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ షాక్ అయ్యేలా చేశాడు వేణు. సినిమా బ్లాక్ బస్టర్ అవడమే కాదు వేణుకు మంచి క్రేజ్ ను కూడా తెచ్చిపెట్టింది ఈ మూవీ.

Nithin: బ్యాడ్ టైం అన్నారు.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ను సెట్ చేశాడు.. ఈసారి టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు

అదే జోష్ లో తన నెక్స్ట్ సినిమా కోసం మరో ఎమోషనల్ కథను సిద్ధం చేసుకున్నాడు. అదే ఎల్లమ్మ. ఈ సినిమా కోసం నేచురల్ నానిని హీరోగా అనుకున్నాడు. అంతా సెట్ అయ్యింది ఇక షూటింగ్ మొదలవుతుంది అనుకునే టైంలో ఈ సినిమా నుంచి నాని తప్పుకున్నాడు. దానికి కారణాలు కూడా వేరే ఉన్నాయి. ఆ తరువాత ఈ ప్రాజెక్టులోకి మరో క్రేజీ హీరో శర్వానంద్ వచ్చాడు. ఆల్మోస్ట్ లాక్ అయ్యింది ప్రాజెక్టు కూడా.. కానీ ఎందుకు అక్కడ కూడా వర్కౌట్ అవలేదు. అప్పుడు నితిన్ తో మాట్లాడి ఒప్పించాడు నిర్మాత దిల్ రాజు.

ఇక అప్పటినుంచి ఎల్లమ్మ సినిమాలో హీరో నితిన్ అని అందరు ఫిక్స్ అయ్యారు. రేపోమాపో షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని నితిన్ కూడా చెప్పాడు. కానీ, నితిన్ నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్స్ అవుతుండటంతో మేకర్స్ మరోసారి ఆలోచనల్లో పడ్డారు. ఇదంతా రెండేళ్ల కథ. ఈ రెండేళ్లలో సినిమా షూట్ కూడా కంప్లీట్ అయ్యి రిలీజ్ కూడా అయ్యిండేది అన్ని పర్ఫెక్ట్ గా కుదిరి ఉంటే. ఇంకా ఆలస్యం అయితే, మొదటికే మోసం అయ్యే అవకాశం ఉంది. ఇలా ఏళ్ళ తరబడి సాగదీసిన సినిమాలపై ఆడియన్స్ లో విరక్తి వచ్చే అవకాశం ఉంది. కథలో మ్యాజిక్ ఉన్నప్పటికీ ఆలస్యం అయ్యింది అంటే ఆ ప్రాజెక్టు నెగ్లెక్ట్ చేస్తారు ఆడియన్స్ కాబట్టి, ఎల్లమ్మ విషయంలో మేకర్స్ ఎంత తొందరపడితే అంత మంచిది.