Nithin: బ్యాడ్ టైం అన్నారు.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ను సెట్ చేశాడు.. ఈసారి టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు

నితిన్.. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అయినా పేరు. కారణం (Nithin)అందరికీ తెలిసిందే. హిట్ సినిమా. అవును, ఈ హీరో నుంచి వచ్చిన గత సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలుస్తున్నాయి.

Nithin: బ్యాడ్ టైం అన్నారు.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ను సెట్ చేశాడు.. ఈసారి టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు

Hero Nithin Doing his next movie with young director sai marthand

Updated On : October 17, 2025 / 9:55 AM IST

Nithin: నితిన్.. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అయినా పేరు. కారణం అందరికీ తెలిసిందే. హిట్ సినిమా. అవును, ఈ హీరో నుంచి వచ్చిన గత సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలుస్తున్నాయి. ఇక నితిన్ లాస్ట్ కమర్షియల్ హిట్ అంటే “అఆ”(Nithin) అనే చెప్పాలి. ఈ తరువాత నితిన్ నుంచి దాదాపు 11 సినిమాలు వచ్చాయి. గడ్డలకొండ గణేష్ గెస్ట్ రోల్ తో కలిపి 12. అందులో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ అవలేదు. మధ్యలో భీష్మ కాస్త బెటర్ అనిపించింది. ఇక ఆ తరువాత వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా మారాయి.

Kiran Abbavaram: ఇంకా.. ఇంకా ఎదుగుతూనే ఉంటాను.. కె ర్యాంప్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం కామెంట్స్..

ఈ ఎఫెక్ట్ నితిన్ నెక్స్ట్ సినిమాలపై పడింది. అప్పటికే ఒకే చేసిన రెండు సినిమాల నుంచి కూడా ఆయన్ని తీసేశారు. అందులో బలగం వేణు చేస్తున్న ఎల్లమ్మ, ఇష్క్ దర్శకుడు విక్రమ్ కె కుమార్ సినిమాలు ఉన్నాయి. దీంతో, ఇప్పుడు నితిన్ కెరీర్ ఎలా అని ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కానీ, వారికి ఒక బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పడానికి సిద్ధం అవుతున్నాడు నితిన్. తాజాగా ఒక యంగ్ డైరెక్టర్ చెప్పిన బ్యూటిఫుల్ కథకు ఒకే చెప్పేశాడట నితిన్. ఆ దర్శకుడు మరెవరో కాదు లిటిల్ హార్ట్స్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సాయి మార్తాండ్. ఈ యువ దర్శకుడు ఇటీవల నితిన్ కి ఒక కథను చెప్పాడట. ఆ కథ బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడట నితిన్.

త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది అని ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న టాక్. ఈ క్రేజీ ప్రాజెక్టును ఏషియన్ సినిమాస్ బ్యానర్ పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ నిర్మించనున్నారు. దీనికి సంబందించిన ఫుల్ డీటెయిల్స్ ని కూడా త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాతో అయినా సూపర్ హిట్ అందుకోవాలని ఫిక్స్ అయ్యాడట నితిన్. మరి తన నెక్స్ట్ సినిమా కోసం కుర్ర డైరెక్టర్ ను సెట్ చేసుకున్న నితిన్ కి హిట్ వస్తుందా లేదా అనేది చూడాలి.