పెద్ద హీరోల సినిమా టీజర్‌లకు యూట్యూబ్ షాక్
ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్ తెరకెక్కిస్తున్న సినిమా బ్లాక్ విడో. ఈ మూవీ టీజర్‌ను పదేపదే చూస్తున్న ఓ నెటిజన్‌కు యూట్యూబ్ షాక్ ఇచ్చింది. మీరు ఇప్పటికే 28వేల 763 సార్లు

ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్ తెరకెక్కిస్తున్న సినిమా బ్లాక్ విడో. ఈ మూవీ టీజర్‌ను పదేపదే చూస్తున్న ఓ నెటిజన్‌కు యూట్యూబ్ షాక్ ఇచ్చింది. మీరు ఇప్పటికే 28వేల 763 సార్లు
ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్ తెరకెక్కిస్తున్న సినిమా బ్లాక్ విడో. ఈ మూవీ టీజర్‌ను పదేపదే చూస్తున్న ఓ నెటిజన్‌కు యూట్యూబ్ షాక్ ఇచ్చింది. మీరు ఇప్పటికే 28వేల 763 సార్లు ఈ వీడియోను చూశారు.. కాబట్టి.. మరోసారి దానిని ప్రదర్శించలేకపోతున్నాం అని తెలిపింది. దీనికి సబంధించిన స్ర్కీన్ షాట్ ను ఆ సంస్థ ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఇప్పుడీ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఎన్నడూ లేని విధంగా ఫస్ట్ టైమ్ యూట్యూబ్ ఇలా చేసింది.
ఇకపై యూట్యూబ్‌లో ఒకే వీడియోను పదేపదే చూసేవారికి ఇదేరకమైన పరిస్థతి ఎదురయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా భారత్‌లో పెద్ద హీరోల సినిమాలకైతే కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి. ఒకవేళ యూట్యూబ్ ఈ నిబంధనను అమలు చేస్తే.. పెద్ద హీరోల సినీ టీజర్‌లకు షాక్ తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
హీరో కొత్త సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి విడుదలయ్యేవరకు అభిమానులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. సినిమా టీజర్, ట్రైలర్‌లు విడుదలైతే చాలు కొందరు వీరాభిమానులు వాటిని ఒకటికి పదిసార్లు చూస్తూ మురిసిపోతుంటారు. తమ హీరో ట్రైలర్‌కు భారీ వ్యూస్ తేవాలని ప్రయత్నిస్తుంటారు. అలాగే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి.. హీరోలపై తమ అభిమానాన్ని చాటుకుంటారు. వాటికి విస్తృతమైన ప్రచారం కల్పిస్తారు. అయితే ఇకపై అలా జరక్కపోవచ్చు. యూట్యూబ్‌లో అదేపనిగా అభిమాన హీరోల చిత్రాల టీజర్లు చూడటం కుదరకపోవచ్చు.
Also Read : Banks వార్నింగ్: అకౌంట్లో డబ్బులు పోతే.. సంబంధం లేదు!