young hero arrested in rape case
Priyanth Rao : పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి, ఇటీవల కొత్తగా మా ప్రయాణం అనే సినిమాలో హీరోగా చేసిన యువ హీరో ప్రియాంత్ రావు ఓ జూనియర్ ఆర్టిస్ట్ తో పరిచయం పెంచుకొని, రెండు నెలలు స్నేహం చేసి, ఆ తర్వాత ప్రేమ అని నమ్మించి తనతో శారీరికంగా కలిశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు తనతో సన్నిహితంగా గడిపాడు. ఆ అమ్మాయి గర్భం దాల్చడంతో ప్రియాంత్ మొహం చాటేయడం మొదలుపెట్టాడు.
అంతే కాక ప్రియాంత్ తనకేమి సంబంధం లేదని ఆ జూనియర్ ఆర్టిస్ట్ ని తిట్టడం చేశాడు. గర్భం పోవడానికి మందులు వాడటంతో ఆ జూనియర్ ఆర్టిస్ట్ అనారోగ్యం పాలైంది. అతను పెళ్ళికి ఎంతకూ ఒప్పుకోకపోవడంతో జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులకి ఫిర్యాదు చేసింది.
Mohan Babu : చిరంజీవి బాటలో మోహన్ బాబు.. మలయాళ సినిమా రీమేక్ లో ??
ఆ జూనియర్ ఆర్టిస్ట్ తన ఫిర్యాదులో.. ప్రియాంత్ రావు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేశాడని, కులం పేరుతో దూషించాడని, నమ్మించి మోసం చేశాడని తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టి ప్రియాంత్ రావుని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రియాంత్ రావుని జూబ్లీహిల్స్ పోలీసుల రిమాండ్ కి తరలించారు.