Young heros thinking about their spy movies after agent flop
Spy Movies : రొమాన్స్ రొటీన్ అని, కామెడీ(Comedy) బోర్ కొడుతోందని ఈ సారి ఇంట్రస్టింగ్ స్టోరీ తో వద్దామని స్పై(Spy) యాక్షన్ ని ట్రై చేస్తున్నారు యంగ్ హీరోలు. స్పై సినిమాలు అంటే సింపుల్ గా చేసేస్తే సరిపోదు. దానికి చాలా వర్క్ కావలి. ట్విస్టులు ఉండాలి, ప్రేక్షకుడిలో ఉత్కంఠ రేపాలి. స్పై థ్రిల్లింగ్ సినిమాలంటే చాలా మందికి ఆసక్తి. ఆ సినిమాలు అనుకున్న దానికంటే ఆసక్తిగా ఉండాలి. కానీ ఇటీవల కొంతమంది స్పై థ్రిల్లింగ్ అని చెప్పి ఏదేదో ప్రయోగాలు చేసి బాక్సాఫీస్(Box Office) వద్ద బోల్తా పడుతున్నారు. ప్రస్తుతం పలువురు యువ హీరోలు స్పై థ్రిల్లర్ సినిమాలు చేస్తున్నారు.
కానీ తాజాగా అఖిల్ ఏజెంట్ సినిమా స్పై థ్రిల్లర్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చి దారుణంగా ఫెయిల్ అయ్యాడు. అసలు స్పై అంశాలు ఒక్కటి కూడా థ్రిల్లింగ్ గా లేవు, ఉన్న అంశాలు మరీ దారుణంగా ఉన్నాయి. అసలు ఇలాంటి సీన్లు ఎలా తీశార్రా బాబు అనుకున్నారు ప్రేక్షకులు. చాల కష్టంగా ఉండాల్సిన స్పై సబ్జెక్టుని చాలా సింపుల్ గా తీసేసి పరాజయం పాలయింది ఏజెంట్ సినిమా టీం. దీంతో ఇప్పుడు స్పై సినిమాలు చేస్తున్న యువహీరోలంతా ఆలోచనలో పడ్డారు.
ఇటీవలే కార్తికేయ 2, 18 పేజెస్ తో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న నిఖిల్ ఏకంగా సినిమా పేరే ‘స్పై’ అని పెట్టుకొని రాబోతున్నాడు. నిఖిల్ ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. గ్యారీ డైరెక్షన్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్పై మూవీ షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. ఈ స్పై తో హ్యాట్రిక్ కొడదామని అనుకుంటున్నాడు నిఖిల్. ఇప్పుడు అఖిల్ ఏజెంట్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో స్పై సినిమా గురించి ఆలోచనలో పడ్డాడు నిఖిల్. కానీ నిఖిల్ కథలపై జనాల్లో మంచి అంచనాలే ఉన్నాయి కాబట్టి ఈ సినిమా కూడా వర్కౌట్ అవుతుందని భావిస్తున్నాడు నికెగిల్.
కెరీర్ లో ఇప్పటి వరకు అన్ని జానర్స్ టచ్ చేసిన నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పుడు సరికొత్త లుక్ లో, సరికొత్త జానర్ లో చేస్తున్న మూవీ డెవిల్. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా 1940 ల్లో సెన్సేషన్ అయిన స్టోరీని నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ గా స్పై యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఏజెంట్ రిజల్ట్ చూసి మరోసారి టీమ్ అంతా మూవీ మేకింగ్ ని చెక్ చేసుకునే పనిలో పడ్డారని టాక్.
Sriwass : గోపీచంద్ తో KGF లాంటి యాక్షన్ సినిమా చేద్దామనుకున్నాను.. కానీ..
వరుణ్ తేజ్ కూడా ఏజెంట్ ఫ్లాప్ తో ఇన్ సెక్యూర్ అవుతున్నారని రూమర్ నడుస్తోంది. అసలే వరసగా ఫ్లాపుల్లోఉన్న వరుణ్ తేజ్ ఈసారి హిట్ కొట్టాలంటే సాలిడ్ స్టోరీ కావల్సిందే అని రొటీన్ సినిమాల్ని బ్రేక్ చేసి ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ‘గాండీవధారి అర్జున’గా స్పై మూవీ చేస్తున్నారు వరుణ్. ఈ సినిమాతో ఎలా అయినా హిట్ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తున్న వరుణ్ ఇప్పుడు ఏజెంట్ రిజల్ట్ తో ఆలోచనలో పడ్డాడు.
Agent : అయ్యగారి ఏజెంట్ అప్పుడే ఓటీటీలోకా.. మరీ ఇంత తక్కువ టైంలోనా.. డబ్బులు బొక్క అంటూ ట్రోల్స్..
కెరీర్ లో ఎక్కువగా స్పై థ్రిల్లర్స్ తోనే నిలదొక్కుకున్న అడివిశేష్ ఇప్పుడు గూడచారి 2 తో మరోసారి హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నారు. అందుకే గూడచారికి మించి ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ని గూడచారి 2తో ఆడియన్స్ కి చూపించడానికి ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు భారీ బడ్జెట్, భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ ఫ్లాప్ అవ్వడంతో అడివి శేష్ కూడా మరోసారి గూడాచారి మేకింగ్ ని క్రాస్ చెక్ చేసుకుందామని డిసైడ్ అయ్యాడట. మరి ఈ హీరోల స్పై సినిమాలు ప్రేక్షకులని ఎలా అలరిస్తాయో చూడాలి.