Sriwass : గోపీచంద్ తో KGF లాంటి యాక్షన్ సినిమా చేద్దామనుకున్నాను.. కానీ..

డైరెక్టర్ శ్రీవాస్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలని షేర్ చేసుకున్నారు. శ్రీవాస్ గోపీచంద్ కాంబోలో గతంలో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు మంచి విజయాలు సాధించాయి. దీంతో రామబాణం సినిమాతో హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు ఈ కాంబో.

Sriwass : గోపీచంద్ తో KGF లాంటి యాక్షన్ సినిమా చేద్దామనుకున్నాను.. కానీ..

Director Sriwass shares interesting facts about gopichand Ramabanam movie

Updated On : May 3, 2023 / 8:55 AM IST

Sriwass :  గోపీచంద్(Gopichand), డింపుల్ హయతి(Dimple Hayathi) జంటగా, జగపతి బాబు(Jagapathi Babu), ఖుష్బూ ముఖ్య పాత్రల్లో శ్రీవాస్(Sriwass) దర్శకత్వంలో తెరకెక్కిన రామబాణం సినిమా గ్రాండ్ గా మే 5న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) నిర్మాణ సంస్థ నిర్మించింది. ఇప్పటికే సినిమా నుంచి ట్రైలర్, సాంగ్స్ రిలీజయి ప్రేక్షకులని అలరిస్తున్నాయి.

ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ శ్రీవాస్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలని షేర్ చేసుకున్నారు. శ్రీవాస్ గోపీచంద్ కాంబోలో గతంలో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు మంచి విజయాలు సాధించాయి. దీంతో రామబాణం సినిమాతో హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు ఈ కాంబో.

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీవాస్ మాట్లాడుతూ.. KGF సినిమా చూశాక గోపీచంద్ తో అలాంటి భారీ యాక్షన్ సినిమా తీద్దామనుకున్నాను. నా దగ్గర ఉన్న ఓ మంచి యాక్షన్ కథని గోపీచంద్ కి వినిపించాను. కానీ అది వద్దన్నాడు. మన ఇద్దరం కలిసి లక్ష్యం, లౌక్యం లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమాలు ఇచ్చాం. వాటిని ప్రేక్షకులు ఆదరించారు. మనం మళ్ళీ కలిసి సినిమా చేస్తే ఆడియన్స్ అలాంటి సినిమానే ఆశిస్తారు అని చెప్పి ఏదైనా ఫ్యామిలీ కథ తీసుకురమ్మన్నాడు. దీంతో నేను ఆ యాక్షన్ సినిమా పక్కన పెట్టాల్సి వచ్చింది అని అన్నారు.

Ramabanam Movie : ఇదెక్కడి ప్రమోషన్స్ రా నాయనా.. పాల ప్యాకెట్లు, చలివేంద్రాలతో రామబాణం ప్రమోషన్స్..

ఇక ఈ రామబాణం సినిమా గురించి మాట్లాడుతూ.. గోపీచంద్ యాక్షన్ సినిమా వద్దన్నాక ఈ కథ వినిపించాను. అన్నదమ్ముల అనుబంధంతో, ఫ్యామిలీ, యాక్షన్ అంశాలు ఉంటాయి. ఓకే చేశాడు. అయితే ఈ సినిమాకు మొదట లక్ష్యం 2 అనే టైటిల్ పెడదాం అనుకున్నాం. కానీ ఆ సినిమా వచ్చి చాలా కాలం అయిపోయింది. అలాగే టైటిల్, కథకు కూడా సెట్ అవ్వలేదనిపించింది. అందుకే రామబాణం టైటిల్ తీసుకున్నాం అని అన్నారు.