Ajay Arasada : వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న అజ‌య్ అర‌సాడ‌.. ఇండస్ట్రీలో మరో మ్యూజిక్ డైరెక్టర్ హవా..

పీరియాడిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన వికటకవి సిరీస్ మంచి విజయం సాధించింది. ఈ సిరీస్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేసాడు అజ‌య్ అర‌సాడ‌.

young sensation Music Director Ajay Arasada Exclusive Interview

Ajay Arasada : సినీ పరిశ్రమలో ఎప్పుడు ఎవరి టైం నడుస్తుందో చెప్పలేం. మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నా రెగ్యులర్ గా కొంతమంది పేర్లే వినిపిస్తాయి. ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే దేవిశ్రీ ప్రసాద్ , తమన్ పేర్లే వినిపిస్తున్నాయి. ఇటీవల కొంతమంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ దూసుకుపోతున్నారు. వారిలో ఒకరు అజ‌య్ అర‌సాడ‌. ఇటీవల వరుస సినిమాలు, సిరీస్ లతో మంచి హిట్స్ అందుకుంటూ సక్సెస్ ట్రాక్ లో వెళ్తున్నాడు అజ‌య్ అర‌సాడ‌. ఆయ్, సేవ్ ది టైగర్స్, కలియుగపట్టణంలో, శ్రీరంగ నీతులు, మై డియర్ దొంగ.. ఇలాంటి పలు హిట్ సినిమాలు, సిరీస్ ల తర్వాత ఇటీవలే వికటకవి సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అజ‌య్ అర‌సాడ‌.

నరేష్ అగస్త్య, మేఘ ఆకాష్ మెయిన్ లీడ్స్ లో జీ5 ఓటీటీలో పీరియాడిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన వికటకవి సిరీస్ మంచి విజయం సాధించింది. ఈ సిరీస్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేసాడు అజ‌య్ అర‌సాడ‌. తాజాగా అజ‌య్ అర‌సాడ‌ మీడియాతో మాట్లాడుతూ తన గురించి పలు ఆసక్తికర అంశాలు తెలిపాడు.

Also Read : Pranayagodari : ‘ప్రణయగోదారి’ మూవీ రివ్యూ.. గోదారి గొట్టున ప్రేమకథ..

అజ‌య్ అర‌సాడ‌ తన గురించి చెప్తూ.. మా ఇంట్లో అత్త‌లు, అక్క‌ వీణ వాయిస్తూ ఉంటే చిన్న‌ప్ప‌టి నుంచి గమనిస్తుండటంతో సంగీతంపై ఆసక్తి పెరిగింది. దీంతో శ‌ర‌త్‌ మాస్ట‌ర్ ద‌గ్గ‌ర గిటార్ నేర్చుకున్నాను. గీతం యూనివ‌ర్సిటీలో ఇంజ‌నీరింగ్ జాయిన్ అయ్యాక అక్కడ మ్యూజిక్ బ్యాండ్స్‌తో క‌లిసి తిర‌గ‌టం వ‌ల్ల మ్యూజిక్‌పై మరింత ప‌ట్టు వచ్చింది. చదువు అయ్యాక సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా ప‌నిచేస్తూనే షార్ట్ ఫిల్మ్స్‌కు మ్యూజిక్ ఇచ్చేవాడిని. ఈ క్ర‌మంలో ప్ర‌దీప్ అద్వైత్ డైరెక్ట‌ర్ ప్ర‌దీప్‌కు ప‌రిచ‌యం చేశారు. నేను అంత‌కు ముందు చేసిన ఓ ముప్పై సెక‌న్ల మ్యూజిక్ బిట్ విని నాకు జ‌గ‌న్నాట‌కం సినిమాకు ఛాన్స్ ఇచ్చారు. అలా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి ఇండిపెండెంట్‌గా వ‌ర్క్ చేస్తూనే నా చిన్నప్పటి ఫ్రెండ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీచ‌ర‌ణ్ పాకాల గూఢ‌చారి సినిమాలో కీ బోర్డ్ ప్రోగ్రామింగ్ కోసం వ‌ర్క్ చేయ‌మ‌ని అడ‌గ‌టంతో అలా కొన్ని సినిమాలకు టీమ్ లో వర్క్ చేస్తూనే కొన్ని సినిమాలు, సిరీస్ లకు డైరెక్ట్ గా సంగీతం అందించాను. క్షీర సాగ‌ర మ‌థ‌నం, నేడే విడుద‌ల‌, మిస్సింగ్, శ్రీరంగ‌నీతులు, ఆయ్ సినిమాలు, సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్1, సీజ‌న్‌ 2 , ఇప్పుడు విక‌ట‌క‌వి సిరీస్‌లకు వ‌ర్క్ చేశాను అని తెలిపారు.

తన కెరీర్ లో పెద్ద హిట్ అయిన ఆయ్ సినిమా గురించి మాట్లాడుతూ.. నేను మ్యూజిక్ ఇచ్చిన మిస్సింగ్ సినిమాలో ఓ బీజీఎం బిట్ నిర్మాత బ‌న్నీవాస్‌ గారికి నచ్చడంతో ఆయ్ సినిమాకు ఛాన్స్ ఇచ్చారు. ఆయ్ లాంటి కామెడీ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం మామూలు విష‌యం కాదు. సినిమా హిట్ అయ్యాక ప‌డ్డ క‌ష్ట‌మంతా మ‌ర‌చిపోయాను అని తెలిపారు.

వికటకవి సిరీస్ గురించి మాట్లాడుతూ.. డైరెక్ట‌ర్ ప్ర‌దీప్ మ‌ద్దాలికి ఏం కావాలి అని పక్కాగా క్లారిటీ ఉంది. దీంతో ఈ సిరీస్ కి వర్క్ చేసేటప్పుడు నేను ఎక్కువ కష్టపడలేదు. ప్ర‌దీప్ మ‌ద్దాలికి కావాల్సిన ఔట్‌పుట్ ఇస్తూ వెళ్ళాను. ఆయ్ సినిమా చేసేటప్పుడే విక‌ట‌క‌వి సిరీస్‌లో మూడు ఎపిసోడ్స్‌కు మ్యూజిక్ చేసేశాను. ఆయ్ రిలీజ్ త‌ర్వాత మ‌రో మూడు ఎపిసోడ్స్‌ కంప్లీట్ చేశాను అని తెలిపారు.

అలాగే.. డైరెక్టర్స్ కి కావాల్సిన ఔట్‌పుట్ ఇవ్వ‌ట‌మే నా కర్తవ్యం. అది ఏ జోన‌ర్ సినిమా అయినా, సిరీస్ అయినా మ్యూజిక్ చేయ‌టానికి నేను రెడీనే. ప్రస్తుతం త్రీరోజెస్ సీజ‌న్ 2తో పాటు ఆహాలో ఇంకో రెండు వెబ్ సిరీస్‌ల‌కు వ‌ర్క్ చేస్తున్నాను. కొన్ని సినిమాల‌కు డిస్కషన్స్ జరుగుతున్నాయి అని తెలిపారు.