Jr. NTR: కరోనా నుంచి కోలుకున్న జూనియర్ ఎన్టీఆర్

Jr. NTR: కరోనా నుంచి కోలుకున్న జూనియర్ ఎన్టీఆర్

Young Tiger Ntr Recovers From Covid 19

Updated On : May 25, 2021 / 10:44 AM IST

Young Tiger NTR: దేశంలో కరోనా సెకండ్ వేవ్‌లో చాలా మంది సెలబ్రిటీలకు, రాజకీయ నాయకులకు కరోనా పాజిటివ్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా రెండు వారాల క్రితం కరోనా పాజిటివ్ రాగా.. ఇప్పుడు ఎన్టీఆర్‌కు నెగటివ్ వచ్చింది. చాలా మంది మనో ధైర్యంతో పాటు సరైన చికిత్స తీసుకుని కరోనా నుంచి కోలుకుంటూ ఉండగా.. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోలుకున్నట్లుగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

కరోనాను చాలా సీరియస్‌గా తీసుకోవల్సిన విషయం అని, తాను త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేసిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తనకు వైద్యం అందించిన డాక్టర్స్ కి కూడా పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి, కిమ్స్‌లో పనిచేసే తన కజిన్, డాక్టర్ వీరులకు అలాగే Tenet Diagnostics కు ధన్యవాదాలు తెలిపారు.

ఇదే సమయంలో కోవిడ్ భారిన పడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా ప్రాణాంతక వ్యాధి కాదని, మంచి వైద్యం, ఆహారం, జాగ్రత్తలు తీసుకు కోలుకోవచ్చునని సూచించారు ఎన్టీఆర్. ముఖ్యంగా ఆత్మస్తైర్యమే ఆయుధం అని, భయపడకుండా ధైర్యంగా ఉంటే కరోనాను ఎదిరించి మనల్ని మనం కాపాడుకోవచ్చునని చెప్పారు. అందరూ మాస్క్ వేసుకోవాలిని, ఇంట్లో ఉండాలని ట్వీట్ చేశారు ఎన్టీఆర్.