Ramanna Youth : రామన్న యూత్.. లీడర్స్ వెనక తిరిగే ప్రతి యూత్ చూడాల్సిన సినిమా..

యువ నటుడు అభయ్ నవీన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా “రామన్న యూత్”. ఈ మూవీ థియేటర్ లో..

Youthful political entertainer Ramanna Youth movie review

Ramanna Youth : యువ నటుడు అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా “రామన్న యూత్”. అమూల్య రెడ్డి కథానాయికగా నటించింది. తాగుబోతు రమేష్, అనిల్ గీలా, శ్రీకాంత్ అయ్యంగార్, విష్ణు.. మరికొంతమంది ప్రముఖులు నటించారు. ఎంటర్టైనింగ్ పొలిటికల్ డ్రామాగా ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. “రామన్న యూత్” సినిమా నేడు సెప్టెంబర్ 15న విడుదల అయింది.

Baby Movie : బేబీ సినిమాపై సీపీ తీవ్ర ఆగ్రహం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీవీ ఆనంద్, ఇక ప్రతి సినిమాపైనా నిఘా

కథ విషయానికి వస్తే.. నలుగురు కుర్రాళ్లు ఊర్లో ఖాలీగా తిరుగుతూ తమ ఎమ్మెల్యేని అభినందిస్తూ, ఆయన కోసం, పార్టీ కోసం తిరుగుతూ ఉంటారు. హీరో ఎమ్మెల్యేలాగే లీడర్ అవ్వాలని, ఎమ్మెల్యేకు దగ్గరగా ఉండే తమ ఊరి మనుషులకు బాగా దగ్గరయి, ఎమ్మెల్యేకు దగ్గరవ్వాలని కలలు కంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ఓ పండగకి ఊర్లో ఫ్లెక్సీ వేయించగా ఆ ఫ్లెక్సీ తెచ్చిన తంటాలతో, హీరో అంటే నచ్చని వ్యక్తి చేసే పనులతో, హీరో,అతని ఫ్రెండ్స్ లైఫ్ లో ఏం జరిగింది, హీరో ఎమ్మెల్యేకి దగ్గరయ్యాడా, హీరో లీడర్ అయ్యాడా లేదా అనేది తెరపై చూడాల్సిందే.

Vijay Deverakonda : వంద కుటుంబాలను సెలెక్ట్ చేసిన విజయ్.. ఇక లక్ష ఇవ్వడమే..

ఇటీవల తెలంగాణ ఫ్లేవర్ సినిమాలు చాలా వచ్చి మంచి విజయం సాధిస్తున్నాయి. ఈ సినిమా కూడా అదే తరహాలో వచ్చింది. కాబట్టి తెలంగాణాలో బాగా క్లిక్ అవుతుందని చెప్పొచ్చు. ఇక సినిమాలో హీరో, అతని ఫ్రెండ్స్ చేసే కామెడీ బాగా వర్కౌట్ అయింది. హీరోకి లవ్ ఉన్నా కథలో అంతగా ఇంపార్టెన్స్ అనిపించదు. ఇక ఊళ్ళల్లో జనాలు ఎలా ఉంటారు, అక్కడ పాలిటిక్స్ ఎలా ఉంటాయి అనేది చాలా బాగా చూపించారు. హీరోగా చేస్తూనే డైరెక్టర్ గా కూడా అభయ్ నవీన్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. విష్ణు అనే నటుడు సినిమాకు బాగా ప్లస్ అయ్యాడు. హీరో ఫ్రెండ్స్, తాగుబోతు రమేష్, మిగిలిన నటులు కూడా మెప్పించారు.

టెక్నికల్ గా కెమెరా పనితనం బాగుంది. పల్లెటూళ్ళో జరిగిన సినిమా కావడంతో అక్కడి లొకేషన్స్ ని అందంగా ఆచూపించారు. చిన్న సినిమా అయినా మంచి నిర్మాణ విలువలు పెట్టారు. మ్యూజిక్, BGM కూడా బాగుంది. మ్యూజిక్ లో కూడా తెలంగాణ ఫ్లేవర్ కనిపిస్తుంది. ఇక సినిమా చివర్లో ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు లీడర్స్ వెనుక తిరిగే యువత అంతా కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. రామన్న యూత్ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక: ఈ రివ్యూ, రేటింగ్స్ విశ్లేషకుడి అభిప్రాయం మాత్రమే

ట్రెండింగ్ వార్తలు