Vijay Deverakonda : వంద కుటుంబాలను సెలెక్ట్ చేసిన విజయ్.. ఇక లక్ష ఇవ్వడమే..

ఖుషీ హిట్ అవ్వడంతో విజయ్ దేవరకొండ.. 100 కుటుంబాలకు ఒక లక్ష చొప్పున ప్రైజ్ మనీ అందిస్తాను అంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.

Vijay Deverakonda : వంద కుటుంబాలను సెలెక్ట్ చేసిన విజయ్.. ఇక లక్ష ఇవ్వడమే..

Vijay Deverakonda selected 100 families to donate 1 lakh

Updated On : September 14, 2023 / 4:29 PM IST

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ రీసెంట్ గా ‘ఖుషి’ (Kushi) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ ని అందుకున్నాడు. దాదాపు ఐదేళ్ల తరువాత సక్సెస్ రావడంతో విజయ్ ఫుల్ ఖుషీ అయ్యాడు. దీంతో ఆ ఖుషీని అభిమానులకు కూడా పంచేందుకు ఒక 100 ఫ్యామిలీలను సెలెక్ట్ చేసి.. ప్రతి కుటుంబానికి ఒక లక్ష చొప్పున ప్రైజ్ మనీ అందిస్తాను అంటూ ప్రకటించాడు. అందుకోసం ఒక అప్లికేషన్ ఫార్మ్ ని కూడా రిలీజ్ చేసిన విజయ్.. వచ్చిన అప్లికేషన్స్ నుండి 100 కుటుంబాలను ఎంపిక చేశాడు.

Shah Rukh Khan : అల్లు అర్జున్ ట్వీట్‌కి షారుఖ్ రిప్లై.. ఫైరే నన్ను పొగుడుతుంది..

ఆ ఎంపిక 100 కుటుంబాల లిస్ట్ ని నేడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని కుటుంబాలను కూడా విజయ్ ఎంపిక చేశాడు. ఎంపికైన వారికీ త్వరలో హైదరాబాద్ లో ఖుషీ గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసి వారికీ లక్ష రూపాయిల చెక్ ని అందించనున్నాడు. కాగా విజయ్.. తన అభిమానుల పట్ల తాను చూపుతున్న ప్రేమని ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.

Naga Chaitanya : స్పోర్ట్స్ ఫీల్డ్‌లోకి నాగచైతన్య ఎంట్రీ.. బ్లాక్ బర్డ్‌కి ఓనర్‌గా..

ఇక విజయ్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 లో నటిస్తున్నాడు. ఈ మూవీ మాఫియా బ్యాక్ డ్రాప్ తో ఉండబోతుంది. విజయ్ ఈ సినిమాలో కానిస్టేబుల్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. శ్రీలీల ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ చిత్రంతో పాటు VD13 లో కూడా నటిస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ రెండు చిత్రాల షూటింగ్ ఆల్రెడీ మొదలయ్యి, సాగుతూ ఉంది.