Youtube star to Tollywood actor prasad behara journey
Prasad Behara : యూట్యూబ్ నుంచి సినిమాల్లోకి వచ్చి బిజీ అయిన నటులలో ప్రసాద్ బెహరా ఒకరు. తనదైన కామెడీ టైమింగ్, నటనతో వెబ్ సిరీస్‌లలో మంచి పేరు సంపాదించుకున్నారు. ‘మా విడాకులు’, ‘పెళ్లివారమండి’ వంటి వెబ్ సిరీస్‌లు ఆయనకు మంచి ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టాయి.
ఆ తరువాత సినిమాల్లో అడుగుపెట్టిన ఈ నటుడు (Prasad Behara) చాలా తక్కువ సమయంలోనే వరుస చిత్రాలతో బిజీ అయ్యారు. పెద్దోడిగా ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో అందరి చేత కంటతడి పెట్టించాడు. ఇక రీసెంట్‌గా విడుదలైన మిత్రమండలి చిత్రంలో మాత్రం కడుపుబ్బా నవ్వించేశాడు. ఇలా తన ప్రతీ పాత్రతో ప్రేక్షకులపై తనదైన ముద్ర వేస్తున్నారు.
ఇక బ్యూటీ, బచ్చలమల్లి, విరాజి చిత్రాల్లోని నటనకు ప్రశంసలు అందుకున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న పాపం ప్రతాప్, రోమియో జూలియట్ చిత్రాల్లోనూ ఆయన కీలక పాత్రల్లో కనిపించబోతున్నాడు. అంతేకాదండోయ్.. మరో మూడు చిత్రాల్లోనూ ఆయన లీడ్ రోల్స్‌లో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఒకప్పుడు యూట్యూబ్ స్టార్ ఉన్న బెహరా ఇప్పుడు వెండితెరపై జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాఫిక్‌గా మారింది.