Vishnu Vishal: రజినీ “కూలీ”పై నెగిటీవ్ కామెంట్స్.. ఆయన అలా అనలేదు.. ఆమిర్ కు సపోర్ట్ చేసిన విష్ణు విశాల్..
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కూలీ. తమిళ స్టార్ డైరెక్టర్ (Vishnu Vishal)లోకేష్ కానగరాజ్ తెరకెక్కించిన ఈ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో కింగ్ నాగార్జున, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, ఉపేంద్ర, శృతి హాసన్, రచిత రామ్ కీలక పాత్రలు పోషించారు.

Tamil star Vishnu Vishal supports Aamir in the Coolie movie controversy
Vishnu Vishal: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కూలీ. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తెరకెక్కించిన ఈ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో కింగ్ నాగార్జున, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, ఉపేంద్ర, శృతి హాసన్, రచిత రామ్ కీలక పాత్రలు పోషించారు. ఆలాగే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ సైతం చిన్న గెస్ట్ రోల్ చేశారు. ఎన్నో ప్రత్యేకతలు, భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి నెగిటీవ్ టాక్ వచ్చింది(Vishnu Vishal). దీంతో మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేక భారీ డిజాస్టర్ గా నిలిచింది ఈ సినిమా.
Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్ కి అసలైన సర్ ప్రైజ్.. ఫౌజీ అప్డేట్ ఇచ్చిన కన్నడ బ్యూటీ.. ఇది నిజమేనా..
అయితే, ఈ సినిమా రిలీజ్ తరువాత కూలీ సినిమాపై బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ నెగిటీవ్ కామెంట్స్ చేశాడంటూ ఒక వార్త వైరల్ అయ్యింది.. “తాను తన కెరీర్ లో చేసిన అతిపెద్ద తప్పు అంటే కూలీ సినిమా ఒప్పుకోవడమే అని కామెంట్స్ చేశాడని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో, రజినీ ఫ్యాన్స్ సైతం ఆమిర్ పై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఆయనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ చేశారు. అయితే, తాజాగా ఇదే విషయంపై తమిళ స్టార్ హీరో విష్ణు విశాల్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.
తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. “కూలీ సినిమాపై ఆమిర్ ఖాన్ నెగిటివ్ గా మాట్లాడలేదు. ఎవరో కావాలని ఈ మాటలను ప్రచారం చేశారు. ఈ విషయం గురించి ఆమిర్ ఖాన్ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. అయన కేవలం రజనీకాంత్ పై ఉన్న ప్రేమతోనే కూలీ సినిమా చేశారు”అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో విష్ణు విశాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.