Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్ కి అసలైన సర్ ప్రైజ్.. ఫౌజీ అప్డేట్ ఇచ్చిన కన్నడ బ్యూటీ.. ఇది నిజమేనా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఫౌజీ(Fauzi). సీతారామం ఫేమ్ దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Kannada star Chaithra J Achar gives an update from Prabhas' Fauzi movie
Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఫౌజీ. సీతారామం ఫేమ్ దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆర్మ్ బ్యాక్డ్రాప్ లో, పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ లోనే కాదు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే, ఈ సినిమా నుంచి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణంలో వైరల్ అవుతోంది. తాజాగా అక్టోబర్ 23 (Fauzi)ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమా టైటిల్ అండ్ ప్రభాస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
Samantha: సమంత ఈజ్ బ్యాక్.. ఎట్టకేలకు మొదలైన “మా ఇంటి బంగారం”.. ఇక నాన్ స్టాప్..
టీజర్ లాంటివి విడుదల చేస్తారు అని ఆశపడ్డ ఫ్యాన్స్ కి నిరాశే ఎదురయ్యింది అని చెప్పాలి. నిజానికి ఫౌజీ అనే టైటిల్ చాలా కాలం నుంచి ప్రచారంలో ఉంది. అలాగే ప్రభాస్ ఫస్ట్ లుక్ కూడా అంతగా ఆకట్టుకోకపోవడంతో ఫ్యాన్స్ కాస్తా డిజప్పాయింట్ మెంట్ లో ఉన్నారు. కానీ, వారికి అనుకోని రూపంలో మరో అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ ఇచ్చింది మరెవరో కాదు కన్నడ బ్యూటీ “ఛైత్ర జే అచర్”. ఈ బ్యూటీ కూడా ఫౌజీ సినిమాలో కీలక పాత్ర చేస్తోందట. తాజాగా హీరో ప్రభాస్ కి బర్త్ డే విషెష్ చెప్తూ సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టింది.
“ప్రభాస్ కి బర్త్ డే శుభాకాంక్షలు. ఫౌజీ అనేది దర్శకుడు హను రాఘవపూడి అద్భుత సృష్టి” అంటూ రాసుకొచ్చింది. ఈ ఒక్క లైన్ తో సినిమాపై అంచనాలను పెంచేసింది ఛైత్ర జే అచర్. ఇలా ప్రభాస్ పుట్టినరోజున అనుకోకుండా అప్డేట్ ఇచ్చింది ఈ అమ్మడు. దీంతో, ఆమెకు కృతజ్ఞతలు చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇక నటి ఛైత్ర జే అచర్ విషయానికి వస్తే.. ఈమె సింగర్ కూడా. గతంలో సప్త సాగారాలు దాటి, 3 బీహెచ్కె లాంటి సినిమాలు చేసింది. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ తో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. మరి ఫౌజీ సినిమా ఈ అమ్మడుకు ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందా అనేది చూడాలి.