Samantha: సమంత ఈజ్ బ్యాక్.. ఎట్టకేలకు మొదలైన “మా ఇంటి బంగారం”.. ఇక నాన్ స్టాప్..
సమంత.. ఈ పేరు గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఏ మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ (Samantha)లో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత వరుసగా అవకాశాలు అందుకుంది.

Samantha starrer Maa Inti Bangaram movie regular shooting started
Samantha: సమంత.. ఈ పేరు గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఏ మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత వరుసగా అవకాశాలు అందుకుంది. స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి టాప్ స్టార్ గా ఎదిగింది. తన అందం, అభినయంతో ప్రత్యేకమైన గుర్తింపును, స్టార్డం ను సంపాదించుకుంది. ఆ తరువాత వ్యక్తిగత జీవితంలో తదుపరి స్థానానికి చేరుకున్న సమంత.. కొంతకాలానికే దాని నుంచి బయటకు వచ్చింది(Samantha). ఆ తరువాత ఆరోగ్య సమస్యలు, సమాజం నుంచి నెగిటీవ్ కామెంట్స్ ఎదుర్కొని ఇప్పుడిప్పుడే వాటన్నిటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తోంది.
Nabha Natesh: దీపాల మధ్య దేవకన్యలా నభా నటేష్.. ట్రెడిషనల్ లుక్ అదిరిపోయిందిగా..
కంబ్యాక్ తరువాత ఆమె చేసిన తెలుగు సినిమా ఖుషీ. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న సమంత ఎట్టకేలకు తన కొత్త సినిమాను మొదలుపెట్టింది. అది కూడా తెలుగులో. ఆ సినిమానే “మా ఇంటి బంగారం”. దాదాపు ఏడాది క్రితమే ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వచ్చింది కానీ, రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలవలేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టింది సమంత. దీపావళి పండుగ సందర్బంగా అక్టోబర్ 22న ఈ సినిమా షూటింగ్ అధికారికంగా మొదలయ్యింది.
ఈ సినిమాను దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించనుంది. గతంలో వీరి కాంబినేషన్ లో “ఓహ్ బేబీ” సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈ ఇద్దరి కాంబోలో ఇప్పుడు రాబోతున్న “మా ఇంటి బంగారం” సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఫ్యామిలీ అండ్ క్రైం జానర్ లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ను త్వరగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి చాలా గ్యాప్ తరువాత సమంత చేస్తున్న తెలుగు సినిమా ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూడాలి.