×
Ad

Akira Nandan: అకిరాని చూస్తే సిగ్గేస్తోంది.. ట్రెండ్ అవుతున్న యూట్యూబర్ కవర్ సాంగ్.. ఇది మాస్ క్రేజ్ సామీ

ఇండియా లెవల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి(Akira Nandan) ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ చేసే హంగామా మాములుగా ఉండదు.

YouTuber Cover song with Akira Nandan photos goes viral on social media

Akira Nandan: ఇండియా లెవల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ చేసే హంగామా మాములుగా ఉండదు. కటౌట్ లు, పూలదండలు, పాలాభిషేకాలు ఇలా థియేటర్స్ అన్నీ దేవాలయాల్లాగా మారిపోతాయి. ఇక రీసెంట్ గా వచ్చిన ఓజీ క్రియేట్ చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో(Akira Nandan) ఫుల్లుగా సెలెబ్రేట్ చేసుకున్నారు ఫ్యాన్స్. అయితే, ఇక్కడ విశేషం ఏంటంటే.. ఓజీ సినిమా రిలీజ్ టైంలో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్ కటౌట్ లో కూడా పెట్టేశారు ఫ్యాన్స్.

Bunny Vasu: యుద్దానికి నేను సిద్దమే.. కానీ ఇలా కాదు.. ఇండస్ట్రీలో కొంతమంది.. బన్నీ వాస్ ఎమోషనల్ కామెంట్స్

అసలు ఒక్క సినిమా కూడా చేయకముందే జస్ట్ పవన్ కళ్యాణ్ ఫేమ్ తోనే ప్రకంపనలు సృష్టిస్తున్నాడు అకిరా. ఇక అతను కూడా అచ్చం తండ్రిలాగానే ఉండటంతో ఫ్యాన్స్ వారసుడు అంటూ పెద్ద ఎత్తున అకీరాను సపోర్ట్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. ఎంతలా అంటే, ఒక యూట్యూబర్ అకిరా ఫోటోను పెట్టుకొని కవర్ సాంగ్ చేసింది. బీచ్ లో అకిరా ఫోటోను పెట్టుకొని సీతయ్య సినిమాలో సూపర్ హిట్ అయిన “సిగ్గేస్తోంది నిను చూస్తుంటే” అనే పాటకు డాన్స్ చేసింది.

దాంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఆ వీడియోను షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ ఒక్క వీడియోతో అకీరాకి ప్రస్తుతం ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందొ క్లియర్ గా అర్థమవుతోంది. అప్పుడప్పుడు కనిపిస్తేనే ఈ రేంజ్ లో క్రేజ్ సంపాదించాడంటే ఇక సినిమాలోకి వస్తే తండ్రిని మంచి తనయుడు అవుతాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.