Bunny Vasu: యుద్దానికి నేను సిద్దమే.. కానీ ఇలా కాదు.. ఇండస్ట్రీలో కొంతమంది.. బన్నీ వాస్ ఎమోషనల్ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీ నుంచే కొంతమంది అలా చేయడం బాధేసింది అన్నారు నిర్మాత బన్నీ వాస్(Bunny Vasu). ఆయన నిర్మాణంలో వస్తున్న లేటెస్ట్ మూవీ మిత్ర మండలి.. ప్రియదర్శి, రాగ్ మయూర్, నిహారిక యెన్ఏం, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Producer Bunny Vasu emotional comments on negative publicity
Bunny Vasu: సినిమా ఇండస్ట్రీ నుంచే కొంతమంది అలా చేయడం బాధేసింది అన్నారు నిర్మాత బన్నీ వాస్. ఆయన నిర్మాణంలో వస్తున్న లేటెస్ట్ మూవీ మిత్ర మండలి.. ప్రియదర్శి, రాగ్ మయూర్, నిహారిక యెన్ఏం, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ (Bunny Vasu)కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను విజేందర్ తెరకెక్కించాడు. ఇప్పటికే టీజర్, ట్రయిలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 16 గురువారం విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా మిత్ర మండలి చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో చిత్ర నిర్మాత బన్నీ వాస్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Flora Saini: పెళ్లి వద్దు.. డేటింగే ముద్దు.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫ్లోరా షాకింగ్ కామెంట్స్
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. “ఈ వారం మరికొన్ని సినిమాలు విడుదలవుతున్న కారణంగానే మా సినిమాను గురువారం రిలీజ్ చేస్తున్నాం. ఇది ఓ రకంగా రిస్కే. బుధవారం ప్రీమియర్స్ వద్దని కొంతమంది సలహా ఇచ్చారు. కానీ, ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన, కంటెంట్‌పై నమ్మకంతోనే ప్రీమియర్స్ వేస్తున్నాం. పాజిటివ్ టాక్ వస్తే ఓకే. లేదంటే కష్టమే. అన్నింటికీ సిద్దంగానే ఉన్నాం. మా సినిమా ట్రైలర్‌పై వచ్చిన కామెంట్లు చూసి చాలా బాధేసింది. సినిమా కోసం చాల కష్టపడ్డాం. 10 రోజుల నుంచి నిద్రపోలేదు. మాతో పని చేసిన ఒకాయన చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కామెంట్లు చూసి బాధేసింది.
అందుకే ఆరోజు ఎమోషనల్ అయ్యాను. నాలా ఫీలైన హీరోలు, నిర్మాతలు థాంక్స్ చెప్తూ ఫోన్స్ చేశారు. కొందరు నిర్మాతలు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తుంటే.. మరికొందరు కావాలని ఇలాంటివి చేస్తున్నారు. తమ సినిమా కోసం మరొకరి సినిమాని తొక్కేయటం సరికాదు. నేరుగా వస్తే ఎంత యుద్ధమైనా చేస్తా” అంటూ చెప్పుకొచ్చాడు బన్నీ వాస్. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.