Devraj Patel : రోడ్డు ప్ర‌మాదంలో ప్ర‌ముఖ హాస్య న‌టుడు, యూట్యూబ‌ర్ దుర్మ‌ర‌ణం.. సీఎం సంతాపం

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన‌ ప్ర‌ముఖ హాస్య న‌టుడు, యూట్యూబ‌ర్ దేవరాజ్ పటేల్ (Devraj Patel) రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించాడు. అత‌డి వ‌య‌స్సు 21 సంవ‌త్స‌రాలు.

Devraj Patel

YouTuber Devraj Patel : ఛత్తీస్‌గఢ్‌కు చెందిన‌ ప్ర‌ముఖ హాస్య న‌టుడు, యూట్యూబ‌ర్ దేవరాజ్ పటేల్ (Devraj Patel) రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించాడు. అత‌డి వ‌య‌స్సు 21 సంవ‌త్స‌రాలు. సోమ‌వారం రాయ్‌పూర్‌లో షూటింగ్‌లో పాల్గొనేందుకు వెలుతుండ‌గా అత‌డు ప్ర‌యాణిస్తున్న కారు రాయ్‌పూర్‌లోని లభందిహ్ ప్రాంతం స‌మీపంలో అదుపు త‌ప్పి ట్ర‌క్కును ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో దేవరాజ్ ప‌టేల్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

తీవ్రంగా గాయ‌ప‌డిన అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే అత‌డు మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు తెలిపారు. అతడి మృతి పట్ల ప‌లువురు సినీ, రాజకీయ నాయ‌కులు సంతాపం తెలుపుతున్నారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్య‌మంత్రి భూపేష్ బఘెల్ ( Bhupesh Baghel ) దేవ‌రాజ్ పాత వీడియోను షేర్ చేసి అత‌డికి మృతికి సంతాపం తెలిపారు.”  ‘దిల్ సే బురా లగ్తా హై’తో మనందరినీ నవ్వించి దేవరాజ్ పటేల్ ఈరోజు మమ్మల్ని విడిచిపెట్టారు. ఈ చిన్న వయస్సులో అద్భుతమైన ప్రతిభను కోల్పోవడం చాలా బాధాకరం. ఈ నష్టాన్ని భరించే శక్తిని ఆయన కుటుంబానికి, ప్రియమైన వారికి భగవంతుడు ప్రసాదించాలి. ఓం శాంతి.” అంటూ ట్వీట్ చేశారు.

BHAAG SAALE Trailer : తెలంగాణ అంటే కేసీఆర్‌కు ఎంతిష్ట‌మో.. నువ్వంటే అంత ఇష్టం

Upasana : డెలివ‌రీకి ముందు.. రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌ల ఆనందాన్ని చూశారా..?

మహాసముంద్ జిల్లాకు చెందిన దేవ్‌రాజ్ ప‌టేల్ దాబ్ పాలి గ్రామ నివాసి. అత‌డి తండ్రి ఘ‌న‌శ్యామ్ ప‌టేల్ వ్య‌వ‌సాయం చేస్తుంటాడు. యూట్యూబ్‌లో రీల్స్ చేస్తూ ఫేమ్ తెచ్చుకున్నాడు. యూట్యూబ‌ర్ భువ‌న్ బామ్‌తో క‌లిసి ‘దింధోర’ అనే వెబ్ సిరీస్‌లో న‌టించాడు. ఆ సిరీస్‌లో ‘దిల్ సే బురా లగ్తా హై భాయ్’ అనే డైలాగ్‌తో మ‌రింత పేరు సంపాదించుకున్నాడు. అత‌డికి యూ ట్యూబ్‌లో నాలుగు ల‌క్ష‌ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. మంచి గుర్తింపు సాధించిన త‌రువాత ముఖ్య‌మంత్రి భూపేష్ బఘెల్‌తో కూడా ప‌రిచ‌యమైంది.

Allu Sirish : ఇన్నాళ్లు దాచా.. నాలోని అభిమాని వ‌ల్ల ఇక కుద‌ర‌లేదు

ఇదిలా ఉంటే. దేవ్‌రాజ్ తన మరణానికి కొన్ని గంటల ముందు సోమవారం మధ్యాహ్నం ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్‌ను పంచుకున్నాడు. “లేకిన్ మే క్యూట్ హు నా దోస్తో?” అతను క్యాప్షన్‌లో అడిగాడు. ఇదే అత‌డి చివ‌రి పోస్ట్.