ys vijayamma consolled krishnam raju wife
YS Vijayamma : నటుడు, మాజీ కేంద్రమంత్రి, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు మరణం అయన కుటుంబానికి, టాలీవుడ్ కి తీరని లోటు. అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకి నివాళులు అర్పించారు. పలువురు ప్రముఖులు ఇంకా కృష్ణంరాజు ఇంటికి తరలి వస్తున్నారు. అయన భార్యని, కుటుంబాన్ని పరామర్శించి ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు.
Krishnam Raju: మంచితనానికి నిలువెత్తు నిదర్శనం కృష్ణంరాజు.. విగ్రహం కట్టిస్తానంటున్న తలసాని!
తాజాగా సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు ఇంటికి వెళ్లారు వైఎస్ విజయమ్మ. కృష్ణంరాజుకు నివాళులు అర్పించి అయన భార్య శ్యామలతో పాటు కుటుంబ సభ్యులను విజయమ్మ పరామర్శించారు. కృష్ణంరాజుతో తన భర్త వైఎస్సార్‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.