Krishnam Raju: మంచితనానికి నిలువెత్తు నిదర్శనం కృష్ణంరాజు.. విగ్రహం కట్టిస్తానంటున్న తలసాని!

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి హఠాన్మరణం టాలీవుడ్ తో పాటు సినీ ప్రేమికులను కూడా కలిచివేసింది. నేడు(శుక్రవారం) హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన 'కృష్ణంరాజు సంస్మరణ సభ'కు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ..

Krishnam Raju: మంచితనానికి నిలువెత్తు నిదర్శనం కృష్ణంరాజు.. విగ్రహం కట్టిస్తానంటున్న తలసాని!

Talasani Srinivas Yadav Promisses to build a Krishnam Raju Statue in Film Nagar

Krishnam Raju: టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి హఠాన్మరణం టాలీవుడ్ తో పాటు సినీ ప్రేమికులను కూడా కలిచివేసింది. సినీ నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నేతగా పనిచేసిన అయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల కొంత అస్వస్థకు గురి కావడంతో కృష్ణంరాజు గారిని హాస్పిటల్ కు తరలించారు, ఎప్పటిలాగానే తిరిగి వస్తారు అనుకున్న రెబల్ స్టార్ ఇక లేరు అన్న వార్తను విని.. దిగ్భ్రాంతికి గురైంది యావత్తు సినీ ఇండస్ట్రీ.

Krishnam Raju : సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో కృష్ణంరాజు సంతాపసభ

నేడు(శుక్రవారం) హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ లో క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన ‘కృష్ణంరాజు సంస్మరణ సభ’కు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. “మంచికి మారు పేరు, ప్రేమానురాగాలతో పలకరించే కృష్ణంరాజు గారు చనిపోవడం చాలా దురదుష్టకరం. తన విభిన్నమైన నటనా ప్రదర్శనతో ఎన్టీఆర్, ఏఎన్నార్ తరువాత గొప్ప నటుడు అనిపించుకున్న కృష్ణం రాజుగారుకి గౌరవంగా ఫిల్మ్ నగర్ లో ఒక విగ్రహం ఏర్పాటు చేస్తాం” అంటూ సభాముఖంగా వెల్లడించారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. “సినీ ఇండస్ట్రీ లోనే కాదు, రాజకీయాల్లో కూడా చిన్న మచ్చ లేని వ్యక్తి కృష్ణంరాజు గారు. అయన నాతో గొడవ పడే అంత దగ్గర ఆప్తుడు. భీమవరం అల్లూరి విగ్రహం ఆవిష్కరణ సమయంలో కూడా ఆరోగ్యం సహకరించక పోయిన కారిక్రమానికి వస్తానంటూ నాతో గొడవ పడ్డారు. కరోనా సమయంలో కూడా కృష్ణంరాజు ట్రీట్మెంట్ కోసం లండన్ వెళ్లడానికి మేం అన్ని ఏర్పాట్లు చేశాం. కృష్ణంరాజు గారి మరణ వార్త విని రాజ్నాథ్ సింగ్ నా దగ్గర ప్రభాస్ నంబర్ తీసుకోని ప్రభాస్ తో మాట్లాడినా తన మనసులో వెలితిగా ఉందన్నారు. ఇటీవలే కృష్ణంరాజు ప్రధానిని కావాలని కూడా అన్నారు. ఏదేమైనా అయన మరణం మా పార్టీకి తీరని లోటు” అంటూ వ్యాఖ్యానించారు.