YVS Chowdary : రీ ఎంట్రీతో ఎన్టీఆర్‌ని లాంచ్ చేయబోతున్న వైవిఎస్ చౌదరి?
దివంగత నందమూరి హరికృష్ణ మనవడు, దివంగత నందమూరి జానకిరామ్ తనయుడిని వైవిఎస్ చౌదరి హీరోగా పరిచయం చేస్తాడని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది.
- Saketh U
- Published On : March 26, 2024 / 08:25 AM IST
YVS Chowdary ready to Launch Harikrishna Grand Son NTR Rumours goes Viral in Tollywood
YVS Chowdary : ఒకప్పుడు టాలీవుడ్ లో శ్రీ సీతారాముల కళ్యాణం చూతుము రారండి, సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన వైవిఎస్ చౌదరి ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ పడటం, నిర్మాతగా కూడా లాస్ చూడటంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చివర్రగా 2015లో సాయి ధరమ్ తేజ్ తో రేయ్ సినిమా తీసారు. ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. దీంతో దర్శకుడిగా, నిర్మాతగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
సినిమాలు తీయకపోయినా సినీ పరిశ్రమలో ఈవెంట్స్ కి హాజరవుతూనే ఉంటారు వైవిఎస్ చౌదరి. ఇక వైవిఎస్ ఎన్టీఆర్ కి వీరాభిమాని అని అందరికి తెలిసిందే. ఇప్పుడు వైవిఎస్ చౌదరి ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో హీరోని లాంచ్ చేయబోతున్నట్టు సమాచారం. ఆల్మోస్ట్ పదేళ్ల తర్వాత వైవిఎస్ చౌదరి మళ్ళీ మెగా ఫోన్ పట్టనున్నట్టు తెలుస్తుంది.
దివంగత నందమూరి హరికృష్ణ(Harikrishna) మనవడు, దివంగత నందమూరి జానకిరామ్(Janaki Ram) తనయుడిని వైవిఎస్ చౌదరి హీరోగా పరిచయం చేస్తాడని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. జానకిరామ్ కొన్నేళ్ల క్రితం యాక్సిడెంట్లో మరణించిన సంగతి తెలిసిందే. అతని పెద్ద కొడుకు పేరు కూడా నందమూరి తారక రామారావు. దీంతో ఈ ఎన్టీఆర్ ని వైవిఎస్ చౌదరి హీరోగా లాంచ్ చేస్తారట. యూత్ ఫుల్ లవ్ స్టోరీతో ఎన్టీఆర్ ని లాంచ్ చేయనున్నారు. మరి ఈ ఎన్టీఆర్(NTR) తన తాత, ముత్తాత, బాబాయ్ లాగే నటనలో మెప్పిస్తాడా చూడాలి. వైవిఎస్ చౌదరి కూడా రీ ఎంట్రీతో మళ్ళీహీట్ కొట్టి ఫామ్ లోకి వస్తాడా చూడాలి.
Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఈ సారి ఉగాది సెలబ్రేషన్స్ జరుపుకునేది అక్కడే..
ఇక జానకిరామ్ తనయుడు ఎన్టీఆర్ ఫోటోలు ఎక్కడా లేకపోవడం గమనార్హం. చిన్నప్పుడు ఓ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు తప్ప పెద్దయ్యాక ఎలా ఉంటాడు అనే ఫోటోలు లేవు. దీంతో ఆ హీరో ఎలా ఉన్నాడో అని నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కాబట్టి ఎదురుచూడాల్సిందే.
