Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఈ సారి ఉగాది సెలబ్రేషన్స్ జరుపుకునేది అక్కడే..

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఎన్నికలు ఉండటంతో రాజకీయాల్లోనే ఫుల్ బిజీగా ఉన్నారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఈ సారి ఉగాది సెలబ్రేషన్స్ జరుపుకునేది అక్కడే..

Pawan kalyan Ugadi Celebrations Update

Updated On : March 26, 2024 / 8:00 AM IST

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఎన్నికలు ఉండటంతో రాజకీయాల్లోనే ఫుల్ బిజీగా ఉన్నారు. చేతిలో ఉన్న సినిమాలన్నీ పక్కన పెట్టేసి పూర్తి టైం రాజకీయాలకు కేటాయించారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ.. టీడీపీ, బీజేపీ పార్టీలతో కలిసి పోటీ చేయబోతుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు. త్వరలోనే పవన్ పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెడతారని సమాచారం.

Also Read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్.. నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ ఎప్పుడో తెలుసా? ఇవాళ షూటింగ్ ఎక్కడంటే..?

అయితే ఈ సారి పవన్ కళ్యాణ్ తన ఉగాది సెలబ్రేషన్స్ ని పిఠాపురంలోనే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అని తెలుస్తుంది. పిఠాపురంలో జనసేన కార్యకర్తలతో ఉగాది(Ugadi) సెలబ్రేషన్స్ చేసుకొని తెలుగు నూతన సంవత్సరం నాడు పిఠాపురం నుంచి తన ప్రచారాన్ని మొదలుపెట్టాలని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. పవన్ ఉగాదికి పిఠాపురం వస్తున్నాడు అని టాక్ రావడంతో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఈ సారి ఉగాదిని పిఠాపురంలో మరింత గ్రాండ్ గా చేసుకోడానికి రెడీ అవుతున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే OG సినిమా వర్క్ మాత్రం జరుగుతుంది. సెప్టెంబర్ 27న ఈ సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ప్రస్తుతానికి పక్కన పెట్టి ఆ డైరెక్టర్స్ వేరే సినిమాలు చేసుకుంటున్నారు. పవన్ అభిమానులు OG సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.