YVS Chowdary : మహేష్ బాబు ఇచ్చిన సలహాతోనే.. ధైర్యం చేసి అటుగా అడుగులు వేశాను..

టాలీవుడ్ దర్శకుడు వైవిఎస్ చౌదరి తన కెరీర్ లో ఓ పెద్ద నిర్ణయాన్ని.. మహేష్ బాబు ఇచ్చిన సలహాతోనే తీసుకున్నట్లు వైవిఎస్ పేర్కొన్నారు.

YVS Chowdary said he took big decision in his life with Mahesh Babu suggestion

YVS Chowdary : టాలీవుడ్ దర్శకుడు వైవిఎస్ చౌదరి తీసింది కొన్ని సినిమాలే అయినా.. వాటిలో కొన్ని గుర్తిండిపోయే చిత్రాలు తెరకెక్కించారు. ఎడిటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ దర్శకుడు.. రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా కూడా ఇండస్ట్రీలో సేవలు అందించారు. అయితే కెరీర్ లో ఓ పెద్ద నిర్ణయాన్ని మాత్రం.. మహేష్ బాబు ఇచ్చిన సలహాతోనే తీసుకున్నట్లు వైవిఎస్ పేర్కొన్నారు.

వైవిఎస్ చౌదరి దర్శకుడిగా తన రెండో సినిమాని మహేష్ బాబుతో చేశారు. 2000వ సంవత్సరంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన ‘యువరాజు’ మూవీ వీరిద్దరి కలయికలో తెరకెక్కిన చిత్రమే. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది. అయితే యువరాజు షూటింగ్ సమయంలో.. మహేష్ అండ్ వైవిఎస్ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహంతోనే మహేష్, వైవిఎస్ చౌదరికి ఒక మంచి సలహా ఇచ్చారట.

Also read : Mahesh Babu – Suma Kanakala : మహేష్-నమ్రత.. సుమ-కనకాల.. కపుల్స్ మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా..?

ఆ సలహా ఏంటంటే.. యువరాజు మూవీ తరువాత దర్శకుడిగా మరో సినిమా తెరకెక్కించడానికి వైవిఎస్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండేళ్ల పాటు మరో సినిమాని డైరెక్ట్ చేయడానికి నిర్మాత దొరకలేదు. అలా ఇబ్బందులు పడుతున్న సమయంలో మహేష్, వైవిఎస్‌తో ఇలా అన్నారట.. “మీరు ఒక నిర్మాణ సంస్థ స్టార్ట్ చేయండి. నేను మీకు సినిమా చేస్తాను” అని చెప్పారట. మహేష్ సలహా విన్న వైవిఎస్.. ఆర్ నారాయణ మూర్తి, ఈవీవీ సత్యనారాయణని స్ఫూర్తిగా తీసుకోని ‘బొమ్మరిల్లు’ పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు.

ఇక ఈ నిర్మాణ సంస్థలో మొదటి సినిమాగా ‘లాహిరి లాహిరి లాహిరిలో’ తెరకెక్కించారు. లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం.. సూపర్ హిట్టుని అందుకుంది. ఈ మూవీ తరువాత ఈ ప్రొడక్షన్ హౌస్‌లో.. సీతయ్య, దేవదాసు వంటి సూపర్ హిట్టు సినిమాలను కూడా తెరకెక్కించారు. ప్రస్తుతం అయితే ఈ దర్శకుడు.. నిర్మాణంకి, దర్శకత్వంకి కూడా దూరంగానే ఉంటున్నారు.