Zee5 OTT : రిలీజ్ కి ముందే భారీ సినిమాలను కొనేస్తున్న ఓటీటీ.. ఏడు భాషల్లో గట్టిగానే ప్లాన్ చేసింది..
తాజాగా తమ రాబోయే సినిమాలను, భారీ పెట్టుబడులను ప్రస్తావిస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసి మీడియాతో మాట్లాడారు జీ5 ఓటీటీ.(Zee5 OTT)
Zee5 OTT
Zee5 OTT : ఇటీవల సినిమాలను ఓటీటీలు పోటీ పడి మరీ కొంటున్నాయి. కొన్ని ఓటీటీ సంస్థలు సినిమా మొదలవ్వగానే నిర్మాణ భాగస్వామిగా మారుతున్నాయి. హిట్ అయితేనే కొన్ని ఓటీటీలు సినిమాలను కొనుక్కుంటున్నాయి. కానీ తాజాగా జీ5 సంస్థ రిలీజ్ కి ముందే అన్ని భాషల్లో భారీ సినిమాలను కొనేస్తుంది. తాజాగా తమ రాబోయే సినిమాలను, భారీ పెట్టుబడులను ప్రస్తావిస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసి మీడియాతో మాట్లాడారు జీ5 ఓటీటీ.
తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషలను కవర్ చేస్తూ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్, AI ఆధారిత కథనాలు, యానిమేషన్, పిల్లల వినోదం.. ఇలా అన్నిటిలో లైనప్ చేసుకుంటుంది ఈ ఓటీటీ సంస్థ. ఇటీవల ఆకొన్ని రోజుల క్రితం తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, వృద్ధి సినిమాస్, తమిళంలో ఫ్యాషన్ స్టూడియోస్, కన్నడలో కెవిఎన్ ప్రొడక్షన్స్.. ఇలా మలయాళం, బెంగాళీ, హిందీలో కూడా పలు సంస్థలతో భాగస్వామిగా మారి సినిమాలు నిర్మిస్తున్నామని ప్రకటించింది జీ5.
Also Read : Aadarsha Kutumbam : ఆదర్శకుటుంబం నుంచి మరో వీడియో.. చిట్టిబాబు చిట్టితల్లి..
హిందీలో.. కాంబ్లీ(క్రికెటర్ వినోద్ కాంబ్లీ జీవితంపై ప్రేరణతో), ది స్కామ్ లీక్డ్, కాఫీ కింగ్, జీనా ఐసీ కా నామ్ హై 2.0(ఆర్.మాధవన్ హోస్ట్‌గా), ఐకానిక్ జీ హారర్ షో, రంగ్‌బాజ్ ఎస్4, జవావర్2,బకైతి ఎస్2 .. లాంటి సిరీస్ లను ప్రకటించింది. వీటితో పాటు థియేట్రికల్ రిలీజ్‌లైన తర్వాత స్ట్రీమింగ్ కాబోయే సినిమాలలను కూడా ప్రకటించింది. హై జవానీతో ఇష్క్ హోనా హై, బండార్, భారత్ భాగ్య విధాత, పూజా మేరీ జాన్.. ఇలా దాదాపు ఓ పడి హిందీ సినిమాలను ప్రకటించింది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మరాఠీ, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో కూడా సినిమాలు, సిరీస్ లను ప్రకటించింది.
తెలుగులో శ్రీమతి(నివేథా థామస్), అబ్జెక్షన్ మై లార్డ్ (శ్రీకాంత్) సిరీస్ లతో పాటు జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 తో పాటు రాబోయే వెంకీ అనీల్ రావిపూడి, ఎన్బీకే111, వృషకర్మ.. సినిమాలను కూడా కొన్నట్టు ప్రకటించింది. ఇలా తమిళ్, కన్నడ, బెంగాలీ భాషల్లో కూడా అనేక కొత్త సినిమాలను కొనుక్కుంది. కొత్త వెబ్ సిరీస్ లను ప్లాన్ చేస్తుంది జీ5.
Also Read : Ajay Bhupathi : నేను టైం వేస్ట్ చేసుకోను.. పాన్ ఇండియా సినిమాలపై డైరెక్టర్ కామెంట్స్..
ఈ సందర్భంగా జీ5 ఇండియా బిజినెస్ హెడ్ తేజ్‌కరన్ సింగ్ బజాజ్ నేడు మీడియాతు మాట్లాడుతూ.. మేం ఎంటర్టైన్మెంట్ ట్రెండ్స్‌ను ఫాలో కావడం కాదు, వాటిని క్రియేట్ చేస్తున్నామని నమ్ముతున్నాం. మేం చెప్పే ప్రతి కథ ఒక సింపుల్ ఫిలాసఫీపై ఆధారపడి ఉంటుంది. ఈ కంటెంట్ లైనప్ మా అతిపెద్ద స్టేట్మెంట్. భారతదేశంలోని అగ్ర దర్శకులు, నిర్మాణ సంస్థలు, నటీనటులతో కలిసి సినిమాలు, సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్, AI ఆధారిత కథనాలు, అనిమేషన్, పిల్లల కంటెంట్‌ను ఏడు భాషల్లో అందిస్తున్నాం అని తెలిపారు.
జీ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ రాఘవేంద్ర హున్సూర్ మాట్లాడుతూ.. మా దృష్టిలో గొప్ప కంటెంట్ అంటే ఎక్కువ సంఖ్యలో ఉండటం కాదు, ప్రేక్షకులతో బలంగా కనెక్ట్ అయ్యే కథలను ముందుకు తీసుకురావటమే. డిఫరెంట్‌గా, తమ స్వరాన్ని ధైర్యంగా వ్యక్తపరిచి భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే శక్తి ఉన్న కథలను ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం అని అన్నారు.
