Ajay Bhupathi : నేను టైం వేస్ట్ చేసుకోను.. పాన్ ఇండియా సినిమాలపై డైరెక్టర్ కామెంట్స్..
ఫ్యూచర్ లో పాన్ ఇండియా సినిమాలు చేస్తారా అని అడగ్గా అజయ్ భూపతి ఆసక్తికర సమాధానం ఇచ్చారు.(Ajay Bhupathi)
Ajay Bhupathi
Ajay Bhupathi : RX100, మంగళవారం సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ అజయ్ భూపతి. ఇప్పుడు కృష్ణ అన్న కొడుకు ఘట్టమనేని జయకృష్ణని పరిచయం చేస్తూ శ్రీనివాస మంగాపురం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా జులై 30న రిలీజ్ అవుతుండగా నేడు మీడియాతో మాట్లాడాడు అజయ్ భూపతి.
ఇటీవల పాన్ ఇండియా హవా రావడంతో చిన్న పెద్ద హీరోలు, దర్శకులు అందరూ పాన్ ఇండియా సినిమా అని తీస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం లాంటి పాన్ ఇండియా కంటెంట్ మీ దగ్గర ఉన్నా మీరు ఎందుకు పాన్ ఇండియా సినిమాలు చెయ్యట్లేదు. ఫ్యూచర్ లో పాన్ ఇండియా సినిమాలు చేస్తారా అని అడగ్గా అజయ్ భూపతి ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
Also Read : Ajay Bhupathi : నాగార్జునకు కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్.. నిర్మాతలు ఆ అభిప్రాయం నుంచి బయటకు రావాలి..
అజయ్ భూపతి మాట్లాడుతూ.. పాన్ ఇండియాకు అనుకొని, పాన్ ఇండియా సినిమా చెయ్యాలని చెప్పి కథ రాయడం మొదలుపెడితే నాలుగేళ్లు పడుతుంది సినిమాకు. నేను అంత టైం వేస్ట్ చేసుకోను. మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. ఉన్నప్పుడు టకటకా మన ఐడియాస్ చెప్పాలి. నేను ఇక్కడికి వచ్చింది నా ఐడియాస్ చెప్పడానికి. అవే పాన్ ఇండియాకు వెళ్తాయి మనం ఉహించము. ఏది వెళ్తుందో తెలియదు. ముందే పాన ఇండియా అని అనుకుంటే అది అయినట్టే. నేను ఆ తప్పులు చేయను. నేను మంగళవారం కూడా సౌత్ వరకే అనుకోని రిలీజ్ చేశాను. కానీ కంటెంట్ బాగుంది కాబట్టి హిందీకి కూడా వెళ్ళింది అని అన్నారు.
