Assam : బీజేపీ ఎంపీ ఇంట్లో ఉరివేసుకున్న 10 ఏళ్ల బాలుడు.. ఆత్మహత్యకు కారణం ఏంటంటే?

అస్సాం బీజేపీ ఎంపీ రాజ్‌దీప్ రాయ్ ఇంట్లో 10 సంవత్సరాల బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Assam

Assam : అస్సాం బీజేపీ ఎంపీ ఇంట్లో 10 సంవత్సరాల బాలుడు ఉరివేసుకుని చనిపోవడం సంచలనం కలిగించింది. బాలుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు.

Naresh Bansal: రాజ్యాంగం నుంచి ‘ఇండియా’ పేరు తొలగించాలంటూ ఏకంగా పార్లమెంటులోనే సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ

అస్సాం సిల్చార్‌లోని బీజేపీ ఎంపీ రాజ్‌దీప్ రాయ్ ఇంట్లో ఉరివేసుకుని ఉన్న 10 ఏళ్ల బాలుడి మృతదేహం కనిపించడంతో కలకలం రేగింది. 5 వ తరగతి చదువుతున్న బాలుడు కొన్నేళ్లుగా తల్లి, అక్కతో కలిసి ఎంపీ ఇంట్లో ఉంటున్నాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (SMCH)కి తరలించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఎంపీ రాజ్ ‌రాయ్ ఇంటికి చేరుకున్నారు. బాలుడు చనిపోయిన వెంటనే తనకు సమాచారం అందిందని.. బాలుడు చనిపోయిన గది తలుపు లోపలివైపు మూసి ఉండటంతో పగులగొట్టామని రాయ్ చెప్పారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని వైద్యుడు బాలుడు చనిపోయినట్లు ప్రకటించారని రాయ్ తెలిపారు.

Ram Shankar Katheria: బీజేపీ ఎంపీ రామ్‌శంకర్‌ కతేరియాకు 2 ఏళ్ల జైలు శిక్ష.. ఏం జరిగిందంటే?

ప్రాథమిక విచారణలో ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నా అసహ మరణంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీడియో గేమ్ ఆడేందుకు తల్లి మొబైల్ ఫోన్ ఇవ్వనందుకు అతను బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.