టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఫోన్ నెంబర్ల పద్ధతిలో మార్పు తీసుకురానుంది. దేశంలో ఇప్పటి వరకూ కొనసాగుతున్న పది నెంబర్ల విషయంలో పెను మార్పులు జరగనున్నట్లు ట్రాయ్ తెలిపింది. నెంబర్లను 10నుంచి 11కు పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించపోయినప్పటికీ నిజమేనంటూ వార్తలు వస్తున్నాయి.
టెలిఫోన్ వాడకాలు ఎక్కువైపోయి నెంబర్ల కొరత ఏర్పడటంతో 10అంకెలకు బదులు 11అంకెలను రంగంలోకి తీసుకురానున్నారట. పది డిజిట్‌లతో ఉండే ఫోన్ నెంబర్లతో అంటే దాదాపు కోట్లలో ఫోన్ నెంబర్లను మొదటి, రెండు డిజిట్‌లు మార్చి ఇవ్వవచ్చు. ఇప్పటికే మొదటి డిజిట్ స్థానంలో 6, 7, 8, 9తో మార్కెట్లో నెంబర్లు చలామణి అవుతూనే ఉన్నాయి.
దాదాపు ఈ నెంబర్లతో 2.1 బిలియన్‌కు పైగా కనెక్షన్లకు ఇప్పటికే తీసుకున్నారట. 2050 నాటికి మరో 2.6బిలియన్ కొత్త నెంబర్లు కావాల్సి ఉందని సమాచారం. గతంలోనూ 1993లో, 2003లో నెంబరింగ్స్ సిస్టమ్‌లో రెండు సార్లు మారాయి. 2003లో చేసిన మార్పు ప్రకారం.. 750మిలియన్ మందికి కనెక్షన్లు దొరికాయి. అందులో 450సెల్యూలర్ కనెక్షన్లు అయితే 300లాండ్ లైన్ కనెక్షన్లు.
ఇకపై ఫోన్ నెంబర్లే కాదు.. ల్యాండ్ కనెక్షన్లు కూడా 10అంకెల ఫోన్ నెంబర్లతో మన ముందుకు రానున్నాయట. 10అంకెల కనెక్షన్ల కోసం డాంగిల్ నెంబర్లను 13అంకెలకు మార్చునున్నారు. దీంతో డాంగిల్ కనెక్షన్ కోసం వాడే పది అంకెల మొబైల్ నెంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి.