రాజస్థాన్‌లో ఘోరం..బొలెరోపైకి దూసుకెళ్లిన ట్రక్కు..11మంది మృతి

  • Publish Date - March 14, 2020 / 06:52 AM IST

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ జిల్లాలో శనివారం (మార్చి 14,2020) ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బలోత్రా – ఫలోడి హైవేపై అత్యంత వేగంగా వచ్చిన ఓ ట్రక్కు అదుపుతప్పి బొలెరో వాహనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటిహుటినా ఘటనాస్థలానికి చేరుకుని  సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, గాయపడినవారిని జోథపూర్ హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. ట్రక్కు వేగంగా ఢీకొనటంతో బొలెరో వాహనం నుజ్జునుజ్జు అయింది. క్రేన్‌ సాయంతో ట్రక్కును పక్కకు తీశారు పోలీసులు. కాగా..మృతుల్లో ఆరుగురు మహిళలు..నలుగురు పురుషులు..ఒక చిన్నారి ఉన్నారనీ..వీరిలో కొత్తగా పెళ్లి అయిన జంట కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. 

ఈ ప్రమాదంపై రాజస్థాన సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తంచేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నానని సీఎం తెలిపారు.

తమిళనాడు రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి 
అలాగే తమిళనాడులోని నామక్కల్‌లో ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. నామక్కల్‌ వద్ద వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది.  మృతులను బీహార్‌ వాసులుగా పోలీసులు గుర్తించారు. 

మహారాష్ట్రలో ముగ్గురు బలి
ఈ క్రమంలో మహారాష్ట్ర రాజధాని ముంబయిలోనూ ఈ ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. వోర్లీ సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, కారు నడుపుతున్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Also Read | అత్తతో అల్లుడి వివాహేతర సంబంధం….భరించలేక నవ వధువు సూసైడ్