11 Year Old Girl Asks Her Own Father For Rs 1 Crore Extortion
Rs 1 Crore Extortion : కోటి రూపాయలు ఇవ్వు..లేకపోతే…కొడుకును, కూతురిని చంపేస్తా…అంటూ తండ్రికి బెదిరింపు మేసేజ్ వచ్చింది. దీంతో అతను కంగారుపడిపోయాడు. అసలు విషయం తెలుసుకున్న అతను ఖంగుతిన్నాడు. డిమాండ్ చేసింది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాదు..సొంత కూతురే డిమాండ్ చేయడం షాక్ తిన్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. తాను ఎందుకు అలా చేసిందో బాలిక చెప్పడంతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం.
ఉత్తర్ ప్రదేశ్ లోని గాజియాబాద్ లో శాలిమార్ గార్డెన్ ఏరియాలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. తండ్రికి ఓ మెసేజ్ వచ్చింది. రూ. కోటి ఇవ్వాలనే డిమాండ్ తో కూడిన మెసేజ్ అది. డబ్బు ఇవ్వకపోతే..కుమారుడు, కుమార్తెను చంపేస్తామని బెదిరించారు. దీంతో అతను కంగారుపడి పోలీస్ స్టేషన్ కు పరుగులు తీశాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ల్యాప్ టాప్ నుంచి మెసేజ్ వచ్చిందని గుర్తించారు. మెసేజ్ చేసింది అతని కూతురేనని నిర్ధారించారు. ఈ విషయం తెలియచేయడంతో కూతురిని ప్రశ్నించాడా ఆ తండ్రి. తనను తల్లిదండ్రులు తిట్టారని, తనను సెల్ ఫోన్ ఉపయోగించవద్దని సూచించినందుకే తాను ఈ పని చేసినట్లు తెలిపింది. బెదిరించిన అనంతరం పారిపోయిన బాలికను పట్టుకున్నారు. బాలిక ఓప్పుకోవడంతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం.