Karnatak Lock Down 15
lockdown in Karnataka కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం(ఏప్రిల్-27,2021)రాత్రి 9గంటల నుంచి 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు యడియూరప్ప సర్కార్ ప్రకటించింది. ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు ఉదయం 6 గంటల నుంచి 10వరకు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
10గంటల తర్వాత షాపులు మూసివేయబడి ఉంటాయని తెలిపింది. ఆల్కహ్కాల్ లేదా మద్యం హోం డెలివరీకి అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజా రవాణా వాహనాల రాకపోకలపై నిషేధం ఉంటుందని తెలిపింది. కేవలం నిర్మాణ,తయారీ,వ్యవసాయ రంగాలకు మాత్రమే తమ కార్యకలాపాలు కొనసాగించుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది.
కాగా,కొద్ది రోజులుగా కర్ణాటకలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా బెంగళూరులో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్క రొజే బెంగళూరులో 20,733 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల్లో 60 శాతం కేసులు,రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కోవిడ్ మరణాల్లో 70శాతం మరణాలు ఒక్క బెంగళూరులో నమోదవుతున్నాయి.
ఆదివారం కర్ణాటకలో 34,804 కరోనా కేసులు,143మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 13.39లక్షలకు,మరణాల సంఖ్య 14,426కి చేరుకుంది. ఇక, రాష్ట్రంలో పాజిటివిటీ రేటు దాదాపు 20శాతంగా ఉంది. అంటే ప్రతి ఐదు శాంపిల్స్ లో ఒకటి పాజిటివ్ గా తేలుతుంది.