×
Ad

ఉగ్రదాడిలో 27కి చేరిన జవాన్ల మృతుల సంఖ్య

కాశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల సంఖ్య 27కు

కాశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల సంఖ్య 27కు

కాశ్మీర్‌లో ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ బ్లాస్ట్‌లో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల సంఖ్య 27కు చేరింది. గురువారం(ఫిబ్రవరి-14,2019) మధ్యాహ్నం శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై పుల్వామా జిల్లాలోని అవంతిపురా టౌన్ దగ్గర్లోని గొరిపురా ఏరియాలో జైషే ఈ మహమద్ ఉగ్ర సంస్థ సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌లోని బస్సు టార్గెట్‌గా దాడికి పాల్పడింది. 70 వాహనాల్లో 2వేల 500మంది జవాన్లు వెళ్తున్నారు.

 

ప్రమాద సమయంలో బస్సులో 35మంది జవాన్లు ఉన్నారు. క్షతగాత్రులను అధికారులు స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. 15మంది జవాన్ల పరిస్థితి విషయంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఐఈడీ బ్లాస్ట్‌తో ఆ ఏరియా అంతా భీకర వాతావరణం నెలకొంది. బ్లాస్ట్ తర్వాత కూడా జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. 2016 ఉరీ ఉగ్రదాడి ఘటన తర్వాత ఇదే అతిపెద్ద ఉగ్రదాడి. ఉగ్రదాడితో     జమ్మూకశ్మీర్‌లో హై అలర్ట్ ప్రకటించారు. పుల్వామా జిల్లాకు అదనపు బలగాలు తరలించారు.

Also Read : తల్లి పడరాని పాట్లు: కొడుకు కోసం కాలేజీల్లో అమ్మాయిల వేట

Also Read : జో రూట్.. నీకు మగాళ్లంటే ఇష్టమా: శిక్షతో ముగిసిన వివాదం

Also Read : చదివింది టెన్త్ క్లాసే : ఆల్కహాల్‌ డిటెక్టర్‌‌తో అద్భుతం చేశాడు

Also Read : బిగ్ ఫైట్ : IPL ఫైనల్ చెన్నైలోనే