Parliament : ముగ్గురు టీఆర్ఎస్ ఎంపీలతో సహా రాజ్యసభ నుంచి 19 మంది సస్పెండ్

ర్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్షాల నిరసనల పర్వం కొనసాగుతోంది. ధరల పెరుగుదలపై నిరసనలు చేపట్టారు విపక్షాల ఎంపీలు. దీంతో రాజ్యసభలో గందగోళం నెలకొంది. దీంతో 19మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.

19 members suspended from Rajya Sabha : పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్షాల నిరసనల పర్వం కొనసాగుతోంది. ధరల పెరుగుదలపై నిరసనలు చేపట్టారు విపక్షాల ఎంపీలు. దీంతో రాజ్యసభలో గందగోళం నెలకొంది. దీంతో 19మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. సోమవారం (7,2022) లోక్ సభ నుంచి నలుగురు కాంగ్రెస్ సభ్యులు సస్పెన్షన్ కు గురికాగా..ఈరోజు రాజ్యసభలో సస్పెన్షన్ల పర్వం కొనసాగింది. దీంతో సభాకార్యక్రలాపాలకు అంతరాయం సృష్టిస్తున్నారంటూ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ 19 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ విధించారు.

సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారని, బిగ్గరగా నినాదాలు చేస్తున్నారని వారిపై ఈ వారాంతం వరకు వేటు వేశారు. సస్పెండైన వారిలో టీఆర్ఎస్ ఎంపీలు లింగయ్య యాదవ్, రవీంద్ర వద్దిరాజు, దీవకొండ దామోదర్ రావు కూడా ఉన్నారు.వీరితో పాటు మొత్తం 19మంది ఎంపీలు సస్పెండ్ కు గురి అయ్యారు.

సస్పెండైన విపక్షాల ఎంపీలు..
లింగయ్య యాదవ్, రవీంద్ర వద్దిరాజు, దీవకొండ దామోదర్ రావు (టీఆర్ఎస్) – తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సుస్మితా దేవ్,డాక్టర్ శంతను సేన్,మౌసమ్ నూర్,శాంతా చెత్రి,డోలా సేన్,అభిర్ రంజన్ దాస్,నదిముల్ హక్..డీఎంకే నుంచి కనిమొళి,
హమీద్ అబ్దుల్లా,గిర్ రంజన్,ఎన్నార్ ఎలాంగో,ఎస్. కల్యాణసుందరమ్,ఎం.షణ్ముగం ఉండగా..సీపీఎం పార్టీకి చెందిన ఏ.ఏ. రహీమ్,డాక్టర్ వి.శివదాసన్ లు..సీపీఐ ఎంపీ
పి.సంతోష్ కుమార్ లను చైర్మన్ సస్పెండ్ చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు