Go First Air Lines : గో ఫస్ట్ విమానాల్లో సాంకేతిక సమస్యలు-అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన పైలట్లు

గోఫస్ట్ విమానాయాన సంస్ధకు చెందిన రెండు విమానాల్లో ఈరోజు సాంకేతిక సమస్యలు తలెత్తాయి.

Go First Flight

Go First Air Lines :  గోఫస్ట్  విమానయాన సంస్ధకు చెందిన రెండు విమానాల్లో ఈరోజు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. శ్రీనగర్ నుంచి ఢిల్లీ, ముంబై నుంచి లేహ్ వెళుతున్న రెండు విమానాల్లో ఈ సమస్యలు వచ్చాయి.  ఇంజన్ లో సమస్యలు రావటంతో రెండు విమానాలను గ్రౌైండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

ముంబై నుంచి లేహ్ వెళ్తున్న విమానాన్ని ఢిల్లీకి మ‌ళ్లించిన‌ట్లు చెప్పారు. ఇంజిన్ నెంబ‌ర్ 2లో స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ట్లు అంచ‌నా వేశారు. శ్రీన‌గ‌ర్ నుంచి ఢిల్లీ వెళ్లే విమానాన్ని కూడా మ‌ధ్య‌లోనే  మ‌ళ్లీ   శ్రీన‌గ‌ర్‌కు మ‌ళ్లించారు. దాంట్లో కూడా రెండో నెంబ‌ర్ ఇంజిన్‌లో స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ట్లు డీజీసీఏ అధికారులు చెప్పారు.

సివిల్ ఏవియేషన్ రెగ్యులేటరీ ఈ విషయంపై దర్యాప్తు జరుపుతోందని.. డీజీసీఏ క్లియర్ చేసినప్పుడే విమానాలు తిరిగి బయలుదేరతాయని చెప్పారు. గత    నెలలో పలు భారతీయ విమానాలలో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తాయి. గత మూడు రోజులుగా పౌర విమానాయానశాఖ మంత్రి   జ్యోతిరాదిత్య సింథియా విమానాల భద్రతపై డీజీసీఏ అధికారులతో  సమావేశాలు నిర్వహించారు.

రెండు రోజుల క్రితం షార్జా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం ఉందని పైలట్ తెలియడంతో పాకిస్థాన్‌కు మళ్లించారు. విమానాన్ని ముందు  జాగ్రత్త చర్యగా కరాచీలో ల్యాండ్ చేయడంతో ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు.

జూలై 14న ఢిల్లీ నుంచి వడోదరకు వెళ్తున్న ఇండిగో విమానం ఇంజన్‌లలో కంపనాలు కనిపించడంతో ముందు  జాగ్రత్తగా జైపూర్‌కు మళ్లించారు.  ఈ నెల  మొదట్లో  ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లే    స్పైస్‌జెట్   విమానం కాక్‌పిట్‌లో ఇంధన సూచిక  లైట్ సరిగా పనిచేయక  పోవడంతో కరాచీకి దారి మళ్లించారు.
Also Read : DGCA : విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు..నిబంధనలు కఠినతరం చేసిన డీజీసీఏ