Chinese Troops : అరుణాచల్ ప్రదేశ్‌‌పై చైనా కన్ను, చొచ్చుకొచ్చిన ఆర్మీ..డ్రాగన్ కుట్రలను అడ్డుకున్న భారత్

లద్దాఖ్ లో అలజడులు సృష్టించిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ పై కన్ను పడింది. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలోనిదంటూ...ఎప్పటి నుంచో చైనా వాదిస్తూ వస్తోంది.

Arunachal Border : లద్దాఖ్ లో అలజడులు సృష్టించిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ పై కన్ను పడింది. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలోనిదంటూ…ఎప్పటి నుంచో చైనా వాదిస్తూ వస్తోంది. అయితే..భారతదేశం దీనిని వ్యతిరేకిస్తోంది. రెండు దేశాల మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా కొనసాగుతుండగానే…చైనాకు చెందిన 200 మంది ఆర్మీ జవానులు అరుణాచల్ ప్రదశ్ లోని తవాంగ్ ప్రాంతంలోకి చొచ్చుకొని వచ్చారు. ఇండియా ఏర్పాటు చేసుకున్న బంకర్లను వారు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. వీరి ప్రయత్నాన్ని భారత్ ఆర్మీ జవాన్లు అడ్డుకున్నారు. వారిని నిర్బందించి..కొద్దిసేపటి అనంతరం వదిలిపెట్టారు.

Read More : National Vaccination: భారత్‌లో పిల్లలకు తొలి వ్యాక్సిన్ ఇదే.. ధర ఎంతంటే?!

వక్రబుద్ధితో సరిహద్దుల్లో నిత్యం బలగాలను మోహరిస్తూ..చైనా కవ్వింపులకు దిగుతోంది. గతంలో చైనా బలగాలు, భారత సైన్యానికి మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అనంతరం భారత్ – చైనా సైన్యం మధ్య చర్చలు జరిగాయి. తాజాగా..సరిహద్దుల్లో భారత బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. దాదాపు 200 మంది పీపుల్ లిబరేషన్ ఆర్మీ (PLA) జవాన్లు వాస్తవాధీన రేఖకు అత్యంత సమీపంగా రావడాన్ని గుర్తించారు. వెంటనే అలర్ట్ అయ్యారు. ఎల్ఏసీని దాటేందుకు ప్రయత్నించడంతో భారత బలగాలు అడ్డుకున్నాయి.

Read More :Corona effect on Shabarimalai: శబరిమలలో ఆంక్షలు.. కరోనా తీవ్రతతో ప్రభుత్వం కీలక నిర్ణయం

కొన్ని గంటల పాటు ఇరువర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం చోటు చేసుకుందని తెలుస్తోంది. ఇరు దేశాల బలగాలు వాస్తవాధీన రేఖ నుంచి వెనక్కి వెళ్లినట్లు సమాచారం. ఇందులో భారత సైన్యానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్ వివాదాంలో పరిష్కారం కోసం భారత్ – చైనా మధ్య కొద్ది రోజుల్లో ఉన్నతస్థాయి సమావేశం జరుగనున్న సమయంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఇప్పటికే 12 సార్లు కమాండర్ స్థాయి చర్చలు జరగగా..మరో రెండు, మూడు రోజుల్లో 13వసారి సమావేశం జరుగనుందని సమాచారం. మరి చైనా బలగాలు భారత సరిహద్దుల్లోకి చొచ్చుకుని రావడం పట్ల…కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు