Bank Holidays : మార్చిలో బ్యాంకులకు సెలవులు దినాలు

సెలవులు తెలియకపోవడంతో కొంతమంది సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. బ్యాంకులు ఏ రోజు తెరిచి ఉంటాయో, ఏ రోజు మూసి ఉంటాయో చాలాసార్లు తెలియదు...

March Month Bank Holidays : ఏదైనా పని చేయడానికంటే ముందు ప్లాన్ చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ఎలా చేయాలని ముందుగానే ఆలోచించుకుని వెళుతుంటారు. ఇంటి పనులు, ఇతర పనులేదైనా ఇబ్బందులు కలుగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటాం. ఆర్థిక లావాదేవీల విషయానికి వస్తే.. మరిన్ని జాగ్రత్త పడుతుంటారు. డబ్బులు ఎవరికైనా పంపించడం, డీడీలు తీయడం, డబ్బులను విత్ డ్రా చేయడం…ఏటీఎం, రుణాలు పొందడం..ఇలా ఎన్నో పనుల మీద బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది.

Read More : Jewellery in Bank Locker : లాకర్‌లో బంగారం దాచారా? ఇన్సూరెన్స్ చేయించారా? పోతే బ్యాంకులు బాధ్యత వహించవు!

అయితే.. బ్యాంకులకు సెలవులు కూడా ఉంటాయి కదా. కానీ.. సెలవులు తెలియకపోవడంతో కొంతమంది సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. బ్యాంకులు ఏ రోజు తెరిచి ఉంటాయో, ఏ రోజు మూసి ఉంటాయో చాలాసార్లు తెలియదు. అయితే ఈ సెలవులు అనేవి రాష్ట్రాల్లోని పండుగలను కలుపుకుని ఉంటాయి. బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ ఆర్బీఐ ప్రకారం వచ్చే నెలకు సంబంధించి సెలవుల జాబితాను విడుదల చేసింది. కొన్ని రాష్ట్రాల్లో సెలవులు ఉండకపోవచ్చు. ఫిబ్రవరి 28వ తేదీ ముుగుస్తోంది. మార్చి నెల స్టార్ట్ కావడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది.

Read More : Covid Treatment Loans : బ్యాంకులు ఆఫర్.. కొవిడ్ చికిత్సకు రూ. 5 లక్షల వరకు రుణాలు..

మార్చిలో బ్యాంకులకు సెలవులు :-

మార్చి 01వ తేదీ మహాశివరాత్రి
మార్చి 03వ తేదీ లోసర్ (సిక్కిం)
మార్చి 04వ తేదీ చాప్ చర్ కుట్ (మిజోరాం)
మార్చి 06వ తేదీ ఆదివారం సాధారణ సెలవు
మార్చి 12వ తేదీ సెకండ్ శనివారం సాధారణ సెలవు

Read More : ఇల్లు కొనాలనుకునేవారికి సువర్ణ అవకాశం..ఇంటిరుణాలపై వడ్డీరేట్లు తగ్గిస్తున్న బ్యాంకులు

మార్చి 13వ తేదీ ఆదివారం సాధారణ సెలవు
మార్చి 17వ తేదీ హలికా దహన్ (కాన్పూర్, లక్నో, డెహ్రాడూన్)
మార్చి 18వ తేదీ హోలీ
మార్చి 20వ తేదీ ఆదివారం సాధారణ సెలవు
మార్చి 22వ తేదీ బీహార్ దివస్
మార్చి 26వ తేదీ నాలుగో శనివారం
మార్చి 27వ తేదీ ఆదివారం

ట్రెండింగ్ వార్తలు